తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకు చేరుకుంది. ఈ వారం మినహా మరొక వారం మాత్రమే మిగిలి ఉండటంతో సీజన్ 3 టైటిల్ ఎవరు గెలుచుకుంటారు అన్న దాని విషయంలో చాలా ఉత్కంఠభరితంగా ప్రేక్షకులు మరియు బిగ్ బాస్ అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఆరుగురు సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ నేపథ్యంలో టాప్ ఫైవ్ లో ఎవరు చోటు దక్కించుకుంటారు అలాగే టైటిల్ ఎవరు గెలుచుకోబోతున్నారు అన్న ఉత్కంఠ బిగ్ బాస్ షో చూస్తున్న ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇదిలా ఉండగా ఆదివారం జరిగిన ఎలిమినేషన్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ నుండి వితిక ఎలిమినేట్ కావటంతో బిగ్ బాస్ హౌస్ లో ఇన్ని రోజులు అలరించిన జంట వరుణ్, వితిక విడిపోయినట్లయింది. సండే ఎపిసోడ్ స్టార్టింగ్ లో అందరికంటే ముందుగా శివజ్యోతి సేవ్ అయింది.


స్టోర్ రూమ్ నుంచ్చి తెప్పించిన కుండలని నాగ్ నామినేషన్ లో ఉన్నవారిచేత పగలగొట్టించారు. అందులో ఉన్న కాయిన్స్ పై శివజ్యోతి పేరు వచ్చింది. దీనితో శివజ్యోతి సేవ్ అయింది. ఆ తర్వాత అలీ రెజా, వరుణ్, వితికలకు నాగ్ కొన్ని కార్డ్స్ ఇచ్చారు. వాటిలో అలీ రెజా ఫోటో ఉండడంతో అతడు సేవ్ అయ్యాడు. ఇక చివరకు వరుణ్, వితిక నామినేషన్ మిలిగారు. నాగార్జున స్టేజిపై ఆంగ్ల అక్షరాలతో వరుణ్, వితిక పేర్లు ఉంచారు. ఎవరి పేరులో అక్షరం మిస్ అవుతుందో వారు ఎలిమినేట్ అయినట్లు. వితిక పేరు పూర్తి కాలేదు. దీనితో ఆమె ఎలిమినేట్ అయింది.


దీంతో వితిక ఎలిమినేట్ కావడంతో వరుణ్ సందేశ్ ఎమోషనల్ అయ్యి గుక్కపెట్టి ఏడవటం జరిగింది. అలాగే ఇంటి నుండి వితిక వెళ్ళిపోయే సమయంలో...వితిక కూడా కంటతడి పెట్టుకుంది. అంతేకాకుండా చివరిగా స్టేజ్ పైకి వచ్చాక రాహుల్ నాకు బ్రదర్ అంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతూ...తన భర్త వరుణ్ సందేశ్ ని బాగా చూసుకోవాలని బాబా భాస్కర్ కి వితిక చెబుతూ ఇంటినుండి ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో  శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతి, వరుణ్ సందేశ్,రాహుల్, అలీ రెజా...మిగిలి ఉండటం జరిగింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: