టాలీవుడ్ టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ లో హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరంభీంగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వచ్చే ఏడాది జులై 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, 

ఈ ఇద్దరు హీరోలు అతి త్వరలో ఒకే స్టేజిపైకి వచ్చి చిందేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా దబాంగ్ 3 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దబాంగ్ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడంతో, ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూడవ సినిమాపై బాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఈ సినిమా యూనిట్, డ్యాన్సింగ్ టూర్ ని నిర్వహించనుంది. ముందుగా అతి త్వరలో యుఏఈ లో జరిగే ఈ టూర్, ఆ తరువాత అమెరికాలో జరుగుతుంది, అనంతరం నవంబర్ 2న ఈ టూర్ మన హైదరాబాద్ నగరానికి చేరుకుంటుందట. అయితే ఆ టూర్ లో భాగంగా జరిగే కార్యక్రమంలో ఇక్కడ మన స్టార్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు సల్మాన్ తో కలిసి నృత్యం చేయనున్నారట. అయితే ప్రస్తుతం విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది. ఒకవేళ ఈ వార్త కనుక నిజమే అయితే మాత్రం, ఒకే స్టేజిపై మెగా, నందమూరి హీరోల డాన్స్ ని చూసే అవకాశం మనకు దక్కుతుంది...!!


మరింత సమాచారం తెలుసుకోండి: