బిత్తిరి సత్తి హీరోగా తుపాకి రాముడు సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో పలువురు రాజకీయ నేతల సమక్షంలో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస యాదవ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు.నన్ను నమ్మి సినిమా చేసిన రసమయికి రుణపడి ఉంటాను. 2003లో దిల్ సినిమా కోసం ఆడిషన్స్ వెళ్లాను. నా ఫోటోలు ఇచ్చి వచ్చాను. అలాంటి నిర్మాత నా తుపాకి రాముడు సినిమాను రిలీజ్ చేయడం అంతా శుభసూచకం అని బిత్తిరి సత్తి అన్నాడు.తుపాకి రాముడు సినిమా టీ ప్రభాకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆదేశ్ రవి, పోషి లాంటి స్థానిక కళాకారులు నటించారు.

నేను బిత్తిరి సత్తిగా మీ అందరి మన్ననలు అందుకోవాడానికి నా ఇంటి పక్క వ్యక్తి ముకుందరెడ్డి స్ఫూర్తి.నా ఎదుగుదలను చూడటానికి నా తండ్రి లేడు. కానీ నా తల్లి చూసి సంతోషపడుతున్నది. ఎక్కడో బ్యాక్ గ్రౌండ్‌లో ఉండే వ్యక్తిని కెమెరా ముందుకు తీసుకువచ్చారు. నాతోనే పవన్ కల్యాణ్ లాగా మేనరిజం చేయించి.. బాలకృష్ణలా తొడగొట్టించారు అని బిత్తిరి సత్తి ఎమోషనల్ అయ్యారు.పోషి, ఆదేశ్ రవి లాంటి యువ కళాకారులు ప్రేక్షకుల ప్రశంసలు అందుకొంటారు అని బిత్తిరి సత్తి పేర్కొన్నారు.ఇప్పటి వరకు నేను అందర్నీ నవ్వించాను. కానీ తుపాకీ రాముడు ద్వారా నేను అందర్నీ ఏడిపిస్తాను.


బఠానీలు బుక్కేటోనికి బాదం పలుకులు తినే అవకాశం కల్పించారు. ఆటోలో వెళ్లే వాడికి ఆడీ కారులో తిరిగే అవకాశం ఇచ్చిన మీ అభిమానం. కురిసే గుడిసే నుంచి విల్లాలో ఉండేలా చేసింది మీ అభిమానం. నా సినిమాను ఆదరించడానికి వచ్చిన ప్రతీ ఒక్కరి ధన్యవాదాలు. మీ అభిమానం ఎప్పటికీ నాపై ఉండాలి అని బిత్తిరి సత్తి ఎమోషనల్ అయ్యాడు. అంటూ ఎమోషనల్ 


మరింత సమాచారం తెలుసుకోండి: