తొలుత గ్లామర్ డాల్ లా అందాల ఆరబోతకు పరిమితమైన తాప్సీ.. హిందీ చిత్రాల్లో ఆమె నటనను చూసి అవాక్కు కావటమే కాదు.. ఇంత మంచి నటిని టాలీవుడ్ దర్శక నిర్మాతలు వాడేసిన తీరుకు అవాక్కు అవ్వాల్సింది.ఒక మంచి నటి టాలెంట్ ను బయటకు తీసుకురావటంలో టాలీవుడ్ ఎంతలా వెనుకబడి ఉందనటానికి తాప్సీ చక్కటి ఎగ్జాంఫుల్ గా చెప్పక తప్పదు.


నటనకు పూర్తిస్థాయి అవకాశం ఉంటే చిత్రాల్ని చేసే విషయంలో ముందుండే తాప్సీ.. తాను సినిమా పూర్తి చేసి ఇంటికి వెళితే.. తన ఇంట్లో ఉండే పరిస్థితి గురించి చెప్పింది వింటే అవాక్కు కావటమే కాదు.. ఇలా కూడా ఉంటుందా? అని ఆశ్చర్యపోవాల్సిందే.తాను సినిమా చేసి ఇంటికి వెళ్లిన తర్వాత.. తాను చేసిన పాత్రలోనే లీనమై.. తానెలా చేస్తానో తనకే తెలీదని.. దీంతో.. తన మూడ్స్ ను చూసి కుటుంబ సభ్యులు వణికిపోతుంటారని చెప్పారు. తాను చేసిన బద్లా సినిమా తర్వాత తన చెల్లెలు తనను చూసి భయపడిపోవటమే కాదు.. నువ్వు వచ్చి నన్ను మర్డర్ చేయకూడదని కోరుకుంటానని చెప్పినట్లు వెల్లడించింది.పబ్లిక్ ముందు మంచిగా ఉన్నప్పటికీ.. లోపల మాత్రం డిఫరెంట్ గా ఉంటానని.. అందరి ముందు కోపాన్ని.. మూడ్ స్వింగ్స్ ను చూపించలేను కానీ ఇంట్లో మాత్రం తానేమిటో చూపిస్తానని చెప్పింది. 


సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులున్నారు. కానీ.. వారికి కాస్త భిన్నమైన తీరు నటి తాప్సీదిగా చెప్పాలి. నటిగా తనను తాను నిరూపించుకునేందుకు ఎలాంటి పాత్ర అయినా వెనుకాడకుండా చేయటం ఆమెకు మాత్రమే సొంతమని చెప్పాలి.తాప్సీ మాటలు వింటే.. ఆమెను ఎవరైనా భరించలగలరు కానీ.. ఇంట్లో వాళ్లు మాత్రం భరించలేరన్నది అర్థం కాక మానదు. ఏమైనా.. తాప్సీని భరిస్తున్న ఇంట్లో వారికి హేట్సాప్ చెప్పాల్సిందే బాస్.  


మరింత సమాచారం తెలుసుకోండి: