బాహుబలి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి దర్శకత్వం తీస్తున్న సినిమా RRR. మొట్టమొదటిసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి మరియు మెగా కుటుంబానికి చెందిన ఇద్దరు మెయిన్ హీరోలు కలసి నటిస్తున్నారు. నందమూరి కుటుంబానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ మెగా కుటుంబానికి చెందిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలసి నటిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి గా ఎదురు చూస్తే ఎప్పుడు విడుదల అవుతుందో అన్న సందర్భంలో ఉన్న సమయంలో ఈ సినిమాపై తాజాగా ఓ వివాదం నెలకొంది. ఈ సినిమా స్వాతంత్ర పోరాట నేపథ్యంలో భాగంగా అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ కలసి పోరాటం చేసే విధంగా ఫిక్షన్ తరహాలో ఓ కల్పిత కథ రూపంలో రాజమౌళి RRR సినిమాను తెరకెక్కిస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే.


దీంతో RRR సినిమాపై అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చరిత్రలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ఎక్కడ కలిసి పని చేసినట్టు లేదని… అలాంటిది ఇప్పుడు రాజమౌళి వీరిద్దరూ కలిసి పోరాటం చేసినట్టు చూపిస్తుండటం చరిత్రను వక్రీకరించడ‌మే అని … అది చాలా తప్పు అని ఆయన నర్సీపట్నం ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. అల్లూరి సీతారామరాజు ఆంధ్ర ప్రాంతంలో ఉండే బ్రిటిష్ వారితో పోరాడి వీర మరణం పొందారు అంతేకాకుండా 1897 లో పుట్టి 1924 న మే ఏడవ తారీఖున మరణించారు.


ఇక కొమురం భీం 1901లో జన్మించి 1941లో మరణించారని చరిత్ర చెబుతోంది. వీరిద్ద‌రు క‌లిసిన‌ట్టు లేని చ‌రిత్ర‌ను క‌ల్పితంగా మార్చ‌డం స‌రికాద‌ని ఈ సినిమాపై పోరాటానికి దిగారు. అయితే ముందుగానే రాజమౌళి ఇది ఫిక్ష‌న్ అని చెప్పటం జరిగింది. మరి ఈ వివాదం పెద్ద అవుతుందో లేక పక్కకు పోతుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: