తమిళనాడు ప్రభుత్వం దీపావళి  మరుసటి రోజు సోమవారం ను  పబ్లిక్ హాలిడే గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 27న దీపావళి కాగా సోమవారం సెలవు ప్రకటిస్తూ  అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఇక  ఈ సెలవు బిగిల్ ,ఖైదీ సినిమాలకు  వరం కానుంది.   ఇళయదళపతి విజయ్ నటించిన బిగిల్ , కార్తి నటించిన ఖైదీ  దీపావళి కానుకగా  ఈనెల 25న విడుదలకానున్నాయి. ఈ రెండు  సినిమాలకు  ఇప్పటికే మంచి బజ్ వచ్చింది  దాంతో పాటు ఇప్పుడు  వరుసగా  నాలుగు రోజులు  సెలవులు  కావడంతో  ఈరెండు చిత్రాలు భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకోనున్నాయి.



స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన బిగిల్ ను  అట్లీ  తెరకెక్కించగా   విజయ్ కు జోడిగా  లేడీ సూపర్ స్టార్ నయనతార నటించింది.  ఇక  ఇంటెన్సివ్ యాక్షన్  డ్రామా  నేపథ్యంలో లోకేష్  కనకరాజ్ తెరకెక్కించిన  ఖైదీ  చిత్రానికి  సామ్ సీఎస్  నేపథ్య సంగీతం అందించగా డ్రీం వారియర్ పిక్చర్స్ పతాకం పై ఎస్ ఆర్  ప్రభు ఈ చిత్రాన్ని నిర్మించాడు.  ఈ సినిమాలో  హీరోయిన్ ,సాంగ్స్ లేకపోవడం ప్రత్యేకతలు  గా చెప్పవచ్చు. అంతేకాదు ఈసినిమా స్టోరీ కేవలం  ఒక్క రాత్రి లోనే  జరుగుతుంది. మరి ప్రయోగాత్మక సినిమా గా రానున్న ఈ చిత్రం  ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.  ఈరెండు సినిమాలు కూడా తమిళం తోపాటు తెలుగులో ఒకేసారి విడుదలకానున్నాయి. కార్తికి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండడం తో  తెలుగులోఈ చిత్రం భారీస్థాయిలో విడుదలవుతుండగా విజయ్ బిగిల్ కూడా  విజిల్ టైటిల్ తో  తెలుగు రాష్ట్రాల్లో  అత్యధిక  స్క్రీన్ లలో విడుదలవుతుంది. దాంతో విజయ్ కి  ఈ చిత్రం  తెలుగులో సాలిడ్ మార్కెట్ ను క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: