కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమా ల్లో ఎక్కువగా నటించారు. కీర్తి సురేష్ చెన్నై అక్టోబర్ 17, 1992 లో జన్మించారు.  ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసింది, తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు.మలయాళం సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు ఈమె నటి, డిజైనర్. ఎక్కువగా మలయాళం,  తమిళ, తెలుగు సినిమాల్లో నటించారు. బాల నటిగా మలయాళంలో నటించారు. తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా నేను శైలజ. ఆతరువాత చాల సినిమాలు చేసారు.

 

మహానటి’ చిత్రంతో తనలోని నటిని పూర్తి స్థాయిలో ఆవిష్కరించి గొప్ప పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. భారతదేశంలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన అవార్డు.. మహానటి చిత్రానికి గాను ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకుంది.

 

ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ కారణంగా ఆమెకు అలాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమా ఆఫర్లు చాలానే వచ్చాయి. వాటిలో ‘మిస్ ఇండియా’ కూడా ఒకటి. సినిమాలో డిఫరెంట్ టైమ్ పిరియడ్స్ లో డిఫరెంట్ లుక్స్ లో కనిపించాల్సి ఉండటంతో బరువు తగ్గిన ఆమె ఆ లుక్స్ కోసం అనేక లుక్ టెస్ట్స్ చేయించుకుందట.

 

ఒక్కో లుక్ కోసం కనీసం 10 టెస్ట్స్ చేశారని.. అలా మొత్తం 50కి పైగా లుక్ టెస్ట్స్ జరిగాయని, అన్నిటిలోనూ కీర్తి సురేష్ చాలా ఓపిగ్గా పాల్గొందని, సినిమాలో ఆమె లుక్స్ చాలా గొప్పగా ఉంటాయని, పాత్రలో కీర్తి సురేష్ ఇట్టే ఒదిగిపోవడం చూసి ఆశ్చర్యం వేసిందని దర్శకుడు నరేంద్ర నాథ్ చెప్పుకొచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: