అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబో మూవీ ‘అల వైకుంఠపురములో’ రిలీజ్ డేట్ వచ్చేసింది. సంక్రాంతి కానుకగా 2019 జనవరి 12 విడుదల చేస్తున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా రిలీజ్ పోస్ట్‌ను విడుదల చేయగా.. అల్లు అర్జున్ సంక్రాంతి పందెంకోడితో ఊర మాస్ గెటప్‌లో మెస్మరైజ్ చేస్తున్నాడు. 

 

ఈ చిత్రంలో బన్నీకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. నవదీప్, నివేదా పేతురాజు, టబు‌లో కీలకపాత్రలు పోషించారు. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. బన్నీ, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో ‘అల.. వైకుంఠపురములో’ మూవీ హాట్రిక్ కొడుతున్నబోతున్నారని బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

అలవైకుంఠపురంలో మూవీ సామజవారగమనా సాంగ్ బంపర్ హిట్ తరువాత త్రివిక్రమ్ బన్నీ మరో పాటతో ఫ్యాన్స్ ను ఫిదా చేయడానికి సిద్ధమయ్యారు. దీపావళి కానుకగా వీరు ‘రాములో రాములా… ‘ అని సాగే ఓ పాటను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నేడు ఈపాట టీజర్ ని విడుదల చేయనున్న చిత్ర యూనిట్, ప్రకటించింది.

 

ఇది పూర్తిగా మాస్ బీట్ తో సాగేసాంగ్ అని ఆ లిరిక్స్ చూస్తే అర్థం అవుతుంది. ఒక క్లాస్ పార్టీ లో చేతిలో మందు గ్లాసుతో బన్నీ మాస్ బీట్ అందుకోవడం ఆసక్తి కలిగిస్తుంది. మత్తులో… బన్నీ ఫ్యాన్స్ కిక్కెకించే మాస్ సెట్స్ తో ఈ పాటలో రెచ్చిపోతాడు అనిపిస్తుంది. మరి ఈ సాంగ్ తీరేదో తెలియాలంటే ఇంకో రోజు ఆగాల్సిందే.ఇక అలవైకుంఠపురం టీం ప్రస్తుతం బన్నీ పై కొన్ని పోరాట సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: