టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా నంబర్ వన్ స్థానంలో ఉన్న నిర్మాత దిల్ రాజు. ఆయన సినిమాలు ఇంటిల్లపాది చూసేవిధంగా ఉంటాయి. అంతేకాదు ఆయన బ్యానర్ నుండి ఒక సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అని దాదాపు ఫిక్సై పోతారు. ఇక వరుసగా సినిమాలను నిర్మించడంలో ఆయనకు మించిన వారు లేరన్న విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాగా పాపులర్ అయ్యారు. బాలీవుడ్ లో కూడా నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు దిల్ రాజు. అయితే ఇప్పటివరకు అన్నీ స్ట్రైట్ సినిమాలనే నిర్మించిన రాజు ఫస్ట్ టైం ఒక రీమేక్ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్టయిన సినిమాని రీమేక్ చేయడానికి రైట్స్ కొనుక్కున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. కానీ ఇప్పటివరకు ఈ రీమేక్ సినిమా అప్‌డేట్ రాలేదని ప్రేక్షకులు అనుకుంటున్నారు. అంతేకాదు అసలు ఈ సినిమా రిలీజవుతుందా అన్న అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు.

తమిళంలో గతేడాది సూపర్ హిట్టైన '96' సినిమాను కోరీ కోరి మరీ తెలుగు రీమేక్ రైట్స్ తెచ్చుకున్నారు దిల్ రాజు. సాధారణంగా ఒక భాషలో హిట్టైన సినిమాని ఇప్పటివరకు రీమేక్ చేయాలని ఆలోచించని రాజు మొదటి సారి ఎందుకనో ఈ సినిమా మీద మోజుపడ్డారు. అయితే చాలా నెలలు ఈ సినిమాని తెరకెక్కించే దర్శకుడెవరు..? హీరో -హీరోయిన్స్ ఎవరు అనే చర్చ జరిగింది. ఎట్టకేలకు తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ నే ఫైనల్ చేసారు. ఆ తర్వాత శర్వానంద్-సమంతలను సెలెక్ట్ చేసారు. లాంచ్ చేసి సెట్స్ పైకి తీసుకెళ్ళారు. అయితే అప్పటి నుండి ఈ సినిమా గురించి ఒక్క అప్ డేట్ కూడా బయటికి రాలేదు. ఇటివలే షూటింగ్ పూర్తయిందని అంటున్నా దర్శక, నిర్మాతలనుండి ఎలాంటి సమాచారం లేదు.

అయితే ఇన్నేళ్ళ కెరీర్ లో మొదటి సారి ఓ రీమేక్ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా రిలీజ్ డేట్ కూడా ప్రకటించకుండా ఎందుకు సీక్రెట్ ఉంచుతున్నారో ఎవరికీ అర్థం కావట్లేదు. ప్రస్తుతం 'సరిలేరు నీకెవ్వరు' సినిమా మీద మాత్రమే దిల్ రాజు ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది. అంతేకాదు అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, నందమూరి కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అందుకే 96 రీమేక్ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం లేదా లేక ఈ సినిమా రష్ చూసి డిసప్పాయింట్ అయి తర్వాత చూద్దామని ఆగారా అన్న విషయం తెలీడం లేదు. ఒకవేళ ఈ దీపావళికి కూడా అప్డేట్ రాకపోతే ఇక రాజు గారి '96' ను ప్రేక్షకులు లైట్ తీసుకోవడం ఖాయమని అందరు చెప్పుకుంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: