టాలీవుడ్ సినిమా పరిశ్రమ యొక్క పేరుని విశ్వవ్యాప్తంగా ఎన్నో ఉన్నత శిఖరాలకు తీసువెళ్లిన గొప్ప దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తాను తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు ఒక దానిని మించి మరొకటి ఎంతటి అత్యద్భుత విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. ఇక ఆ సినిమాలో నటించిన హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టి సహా మిగతా నటీనటులందరికే కూడా దేశ విదేశాల్లో ఎంతో గుర్తింపు లభించింది. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ హిస్టారికల్ ఫిలిం RRR. 

మొట్ట మొదటి సారి టాలీవుడ్ లోని రెండు బడా ఫ్యామిలీస్ అయిన మెగా మరియు నందమూరి ఫ్యామిలీల్లోని ఇద్దరు బడా స్టార్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో భారీ మల్టీస్టారర్ కి శ్రీకారం చుట్టిన రాజమౌళి, ఆ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాలో పలువురు బాలీవుడ్ మరియు కోలీవుడ్ నటులు కూడా నటిస్తుండడం విశేషం. అయితే అప్పుడెప్పుడో ఒక చిన్న ప్రెస్ మీట్ మినహా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ కానీ లేదా పోస్టర్ కానీ రిలీజ్ కాకపోవడంతో ప్రేక్షకులు కొంత నిరాశలో ఉన్నారు. 

అయితే వారందరికీ మంచి బూస్ట్ ని ఇచ్చేలా నేడు RRR మూవీ టీమ్ నుండి ఒక ప్రత్యేక అప్ డేట్ రావడం జరిగింది. నేడు తెలంగాణ విప్లవ వీరుడు కొమరం భీం జయంతిని పురస్కరించుకుని ఆయనను ఒక సారి స్మరించుకుంటూ, ఈ సినిమాలో భీంగా నటిస్తున్న ఎన్టీఆర్ లుక్ ఎంతో అత్యద్భుతంగా ఉంటుందని, ప్రేక్షకులు మరియు అభిమానులు మాదిరిగా తమ సినిమా టీమ్ మొత్తం కూడా ఆయన లుక్ ని వెండితెరపై చూడాలని ఎంతో ఉవ్విళ్లూరుతున్నామని తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒక పోస్ట్ చేస్తూ పేర్కొంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని హీరోలిద్దరి లుక్స్, న్యూ ఇయర్ సందర్భంగా అధికారికంగా రివీల్ కానున్నట్లు సమాచారం....!!


మరింత సమాచారం తెలుసుకోండి: