దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్.ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలైన  రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా  నటిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్... కొమరం భీమ్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా మొదలైనప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి ఇలాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న  సినిమా కావడంతో ఈ సినిమాపై అని ఇండస్ట్రీల ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ సినిమా గురించి ఏ చిన్న లీక్ బయటికి వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. 

 

 

 

 

 అయితే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి సారి ఒక స్వతంత్ర సమరయోధుల పాత్ర లో కనిపిస్తుండడంతో సినీ ప్రేక్షకుల అందరిలో వీళ్ళ నటన ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది. అంతేకాకుండా వీళ్ళ ఫస్ట్ లుక్ ఎప్పుడు విడుదల అవుతుందా ఎప్పుడు చూద్దామా అని సినీ ప్రేక్షకులు అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి. అయితే మొన్నటి వరకు జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ లో పాల్గొన్న గా... ప్రస్తుతం రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్  అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కించబోతున్న ఈ చిత్రంలో నేడు కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారని అంతా భావించారు. 

 

 

 

 

 అయితే ప్రేక్షకులు అనుకున్నట్లుగానే ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు అయిన కొమరం భీమ్ జయంతి నేడు జరువుకుంటుండగా...  నేడు కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఆర్ఆర్ఆర్  చిత్రబృందం కొమరం భీమ్ పాత్రకు  సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. చేతిలో తుపాకి పట్టుకొని ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. కాగా  ఈ ఫస్ట్ లుక్ లో కొమరం భీమ్ పాత్ర లో ఉన్న ఎన్టీఆర్ షాడో మాత్రమే కనిపిస్తుంది. కాగా  భిన్నమైన గెటప్లో చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో కనిపిస్తున్నారు ఎన్టీఆర్. అయితే తాము కూడా యువ భీముని వెండితెరపై చూసేందుకు ఎదురు చూస్తామని చిత్రయూనిట్ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: