బాబు మోహన్... ఒకప్పుడు సినిమాల్లో టాప్ కమెడియన్ గా  సినీ ప్రేక్షకులకు నవ్వులు పంచిన నటుడు. అయితే ఎలాంటి సినిమాల్లో అయినా తనదైన కామెడీని  పండించే బాబు మోహన్... ఆల్  ఆంద్రాలో  సోలో అందగాన్ని  నేనే అంటూ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ఇక తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు బాబు మోహన్ . తెలంగాణలో 2014 లో జరిగిన ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు.... ఇక ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి ఆయనకు సీటు రాకపోవడంతో బీజేపీలో చేరీ  ఎమ్మెల్యేగా పోటీ చేసి తాజాగా జరిగిన ఎలక్షన్లలో ఓడిపోయారు. అయితే బాబు మోహన్ కి కాస్త నోటి దురుసు ఎక్కువ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంది పై నోరు పారేసుకున్న వీడియోలు సోషల్ మీడియా లో ఎన్నో వైరల్ అయ్యాయి. 



 అయితే ఇప్పుడు తాజాగా బాబు మోహన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో బాలకృష్ణ లా  గుర్రపు స్వారీ ఎవరూ చేయలేరని చిరంజీవి గిరంజీవి కి  కూడా అది సాధ్యం కాదని అన్నాడు బాబు మోహన్. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... అప్పట్లో బాలకృష్ణ తో నటించిన  భైరవద్వీపం సినిమా గురించి గుర్తు చేసుకున్నారు. అప్పట్లో భైరవద్వీపం షూటింగ్ రోజులను గుర్తు చేసుకుని మధ్యలోకి మెగాస్టార్ చిరంజీవి లాగటం తో  బాలయ్య అభిమానులు ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంతకీ బాబు మోహన్ ఏమన్నాడు అంటారా... భైరవద్వీపం సినిమా లో బాలకృష్ణ తను  గుర్రాలపై వెళుతుంటాం... అయితే బాలకృష్ణతో పాటు గుర్రాన్ని నడపడానికి ఆయనకి  చాలా కష్టమయ్యేది అని... బాలకృష్ణ గుర్రపుస్వారీ చాలా అద్భుతంగా చేస్తారని బాబుమోహన్ అన్నారు.



 అంతేకాకుండా గుర్రాల పైకి ఎగురుతాడు... గుర్రాల మీద నుంచి దూకడం... అసలు ఏం పట్టుకోకుండా గుర్రపు జూలు  పట్టుకుని గుర్రపు స్వారీ చేస్తారని బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించారు. అయితే బాలకృష్ణ లాగా ఏ హీరో గుర్రపు స్వారీ  చేయలేరని చిరంజీవి గిరంజీవి కి  కూడా అది సాధ్యపడదని బాబు మోహన్ అన్నారు. అయితే బాబు మోహన్ ఏదో ఫ్లోలో చిరంజీవి గిరంజీవి అన్నాడు కానీ చిరంజీవి మీద బాబు మోహన్ కి ఎంత అభిమానం ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఎన్నోసార్లు చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడారు బాబు మోహన్ . అయితే తాజాగా బాబు మోహన్ మాట్లాడింది ఎవరు వీడియో తీసారో తెలియదు కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారిపోయింది. ఇదిలాఉంటే కొదమ సింహం,  కొండవీటి దొంగ ఇక తాజాగా సైరా  సినిమాలో  చిరంజీవి గుర్రపు స్వారీ తో అదరగొట్టిన విషయం అందరికి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: