ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది.  సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డంకి ఎదురౌతూనే ఉన్నది.  సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక.. రామ్ చరణ్ కాలు బెణికింది.  ఆ తరువాత ఎన్టీఆర్ చేతికి చిన్నగాయం అయ్యింది.  


ఆ తరువాత ఈ సినిమాలోని ఓ విదేశీ హీరోయిన్ తప్పుకోవడంతో యూనిట్ నిరాశ చెందింది.  అనంతరం మరో హీరోయిన్ అలియా భట్ కు ఆరోగ్యం బాగాలేదు.  ఎన్టీఆర్ కోసం మరో హీరోయిన్ ను సెట్ చేస్తే ఆమె కూడా తప్పుకున్నది.  దీంతో ఇప్పటి వరకు ఎన్టీఆర్ కు హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అన్నది చెప్పడం లేదు.  సినిమా గురించి అప్డేట్ కూడా బయటకు రావడం లేదు.  సినిమా షూటింగ్ మాత్రం దాదాపుగా 40శాతం పూర్తయినట్టు సమాచారం.  


మాములుగా దసరా రోజున ఏ సినిమాకు సంబంధించి అయినా ఒక చిన్న అప్డేట్ ఇస్తారు.  అది ఫ్యాన్స్ కు మంచి ఊరటను ఇస్తుంది.  కానీ, ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.  కొమరం భీం పుట్టిన రోజున ఏదైన అప్డేట్ ఇస్తారని ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ కాస్త ఊరట చెందారు.  కానీ, కొమరం భీం జయంతి రోజున కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదని స్పష్టంగా అర్ధం అయ్యింది.  


దీనిపై ఫ్యాన్స్ ఒక్కసారిగా ఫైర్ అవుతున్నారు.  కొమరం భీం పుట్టిన రోజన ఒక చిన్న ట్వీట్ చేసింది యూనిట్.  కొమరం భీం జయంతి శుభాకాంక్షలు చెప్తూ.. ఎన్టీఆర్ ను కొమరం భీంగా చూడాలని ఆతృతగా ఉన్నట్టు పేర్కొన్నది.  అంతకు మించి మరెలాంటి సమాచారం ట్వీట్ లో లేకపోవడంతో యూనిట్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.  కొమరం భీం జయంతి రోజునైనా ఏదైనా లుక్ రిలీజ్ చేస్తారని అనుకుంటే ఇలా షాక్ ఇవ్వడం ఏమి బాగాలేదని ఫాన్స్ మండిపడుతున్నారు.  ట్విట్టర్లో వివిధరకాల ఫన్నీ ఫోటోలు పోస్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: