టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అల వైకుంఠపురములో. బన్నీ ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే ఒక కంపెనీకి సీఈఓ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగైన 'సామజవరగమనా' అనే సాంగ్ ఇటీవల రిలీజ్ అయి, యూట్యూబ్ రికార్డులు బద్దలు కొడుతూ, యావత్ టాలీవుడ్ లోనే అత్యధిక లైక్స్ దక్కించుకున్న సాంగ్ గా అతి పెద్ద రికార్డు ని సొంతం చేసుకుంది. 

ఇకపోతే ఈ సినిమా నుండి రాములో రాములా అనే పల్లవితో సాగె రెండవ సాంగ్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. అల్లు అర్జున్ ఎల్లో కలర్ సూట్ ధరించి ఎంతో స్టైలిష్ గా దర్శనం ఇచ్చిన ఈ సాంగ్ ప్రోమో, నిజానికి నిన్ననే రిలీజ్ కావలసి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ సాంగ్ టీజర్ ని నేడు రిలీజ్ చేసారు. ఇక కాసేపటి క్రితం రిలీజ్ అయిన ఈ సాంగ్ ప్రోమోలో బన్నీ సహా హీరోయిన్ పూజ హెగ్డే, నటుడు సుశాంత్, నటి టబు, మురళీశర్మ తదితరులు అందరూ కలిసి మంచి పార్టీ మూడ్ లో ఎంజాయ్ చేస్తూ చిందేయడం ఈ ప్రోమోలో గమనించవచ్చు. యువ గాయనీ గాయకులు అనురాగ్ కులకర్ణి, మంగ్లి లు కలసి ఎంతో అద్భుతంగా ఈ పాటను ఆలపించినట్లు ఈ ప్రోమోని బట్టి చూస్తే అర్ధం అవుతుంది. 

కాసర్ల శ్యామ్ ఎంతో ఆకట్టుకునే సాహిత్యాన్ని అందించిన ఈ సాంగ్, కొంత తెలంగాణ యాసలో సాగుతుందని అర్ధం అవుతోంది. ఇక ప్రస్తుతం ఈ సాంగ్ టీజర్ అదిరిపోయే వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ సాంగ్ పూర్తి లిరికల్ వీడియో ని దీపావళి కానుకగా పండుగ రోజున రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ తరువాత అల వైకుంఠపురములో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పాలి. పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాకు స్వరాలు అందిస్తోంది యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్. ఇకపోతే ఈ సినిమాను పొంగల్ కానుకగా జనవరి 12న రిలీజ్ చేయనున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: