అమలా పాల్ ప్రధాన పాత్ర లో దర్శకుడు రత్నకుమార్ తెర కు ఎక్కించిన  చిత్రం ఆడై. ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది . ఆడై చిత్రం లో అమలా పాల్ న్యూడ్ గా నటించిన విషయం తెల్సిందే . అమలా పాల్ ను  న్యూడ్ గా చూపించినా,  ఎక్కడ కూడా అసభ్యతకు తావులేకుండా  దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నాడు . ఆడై సినిమా కు క్రిటిక్స్ ప్రశంసలు దక్కడం తో , ఈ చిత్రాన్ని హిందీ లో అనువదించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు దర్శకుడు రత్నకుమార్ తన పేస్ బుక్ పేజీ లో పోస్టు చేశాడు .


అమలా పాల్ పోషించిన పాత్ర ను హిందీలో ఒక ప్రముఖ హీరోయిన్ పోషించనుందని లీక్ ఇచ్చాడు . అయితే అమలా పాల్ తరహా  లో బాలీవుడ్ లో అంత  ధైర్యంగా నటించే హీరోయిన్ ఎవరా? అన్న చర్చ ప్రారంభమైంది . ఆడై చిత్ర అనువాద హక్కులను పొందిన దర్శక, నిర్మాత విక్రమ్ భట్ ఈ సినిమా స్టోరీ ని బాలీవుడ్ అగ్ర నటీ కంగనా రనౌత్ విన్పించినట్లు తెలుస్తోంది . కంగనా రనౌత్ కథ విని కొన్ని మార్పులు సూచించినట్లు సమాచారం . అమలా పాల్ తరహా లో న్యూడ్ గా నటించేందుకు కంగనా ఒకే చెప్పిందన్న టాక్ బాలీవుడ్ వర్గాల్లో విన్పిస్తోంది.


   కథ నచ్చితే ఎటువంటి పాత్రలోనైన ఇట్టే ఒదిగిపోయే కంగనా రనౌత్ , ఈ సినిమా లో నటించడానికి  ఒప్పుకుంటే పాత్రకు  ప్రాణం పోసేందుకు న్యూడ్ గా నటించేందుకు వెనక్కి పోదని  సినీ విశ్లేషకులు అంటున్నారు . ఇక ఆడై చిత్రం లోని న్యూడ్ సీన్స్ ను దర్శకుడు రత్నకుమార్ అసభ్యతకు తావు లేకుండా , కళాత్మకంగా తెర కు ఎక్కించగా, విక్రమ్ భట్   న్యూడ్  సీన్స్ ఎలా రూపొందిస్తాడో చూడాలి మరి .


మరింత సమాచారం తెలుసుకోండి: