సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక అన్ని రకాల సినిమాలు, సన్నివేశాల్లో నటించాలి. అప్పుడే నటీనటుల్లో ఉన్న ట్యాలెంట్ ఏంటో ప్రేక్షకులకు తెలిసేది. వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించేందుకు నటి అమలా పాల్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే ఏ హీరోయిన్ ధైర్యం చేయని ‘ఆమె’ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంది. 

 

అమలా పాల్ హీరోయిన్‌గా రత్నకుమార్ తెరకెక్కించిన ఆమె చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి.సినిమాలో దాదాపు గంట పాటు నగ్నంగా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ అమలకు మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.దీపావళి సందర్భంగా కలర్స్‌ తమిళ్‌ టీవీలో ఈ సినిమా ప్రసారం కానుంది. 

 

అయితే ఇప్పుడు ‘ఆమె’ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్నారట. ఈ విషయంపై బాలీవుడ్‌లో హాట్ టాపిక్ హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి బోల్డ్ పాత్రలో నటించే ధైర్యం కంగన రనౌత్‌కు మాత్రమే ఉందని భావించి ఆమెను సినిమాలో ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈమెకు దర్శకుడు కథ చెప్పాడని.. కొన్ని మార్పులకు కంగన సూచించినట్లు తెలుస్తుంది. కథ నచ్చితే ఎలా నటించడానికైనా సిద్ధంగానే ఉంటుంది కంగన.

మరింత సమాచారం తెలుసుకోండి: