తమిళ స్టార్ హీరో ఇళయదళపతి  విజయ్ కి హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వున్న సంధ్య థియేటర్ వద్ద  50ఫీట్ల  కటౌట్ పెట్టారు. విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్  తెలుగులో  విజిల్ పేరుతో  ఈ నెల 25న విడుదలకానుంది.  ఈ సందర్భంగా  విజయ్ కటౌట్ ను పెట్టారు.  ఇక  విజయ్ కి తెలుగు లో కటౌట్ పెట్టడం ఇదే మొదటిసారి.  సర్కార్ తో తెలుగు ప్రేక్షకులకు  దగ్గరైన  విజయ్ ఇప్పుడిప్పుడే  తెలుగులో తన మార్కెట్ ను విస్తరించుకుంటున్నాడు. 




ఇదిలా ఉంటే  విజిల్ పై తమిళ్ తోపాటు  తెలుగులోనూ మంచి అంచనాలు వున్నాయి. దాంతో ఈ  చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో  700స్క్రీన్ లలో విడుదలచేస్తున్నారు.  యంగ్ ప్రొడ్యూసర్  మహేష్ ఎస్ కోనేరు  ఈసినిమా థియేట్రికల్ హక్కులు దక్కించుకోగా   ఏపీ &తెలంగాణ లో కలిపి ఈ చిత్రం 10కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  ఈ సినిమా కు  కనుక హిట్ టాక్ వస్తే  రజినీ , సూర్య తరహాలో  తెలుగులో  విజయ్ కి కూడా మంచి మార్కెట్ ను ఏర్పడనుంది.  ఇక ఈ చిత్రం ప్రపంచ  వ్యాప్తంగా 4000 పై చిలుకు  స్క్రీన్ లలో  విడుదలవుతుంది. విజయ్ కెరీర్ లోనే  ఇదే అతి పెద్ద రిలీజ్.  స్పోర్ట్స్  డ్రామా  నేపథ్యం లో  అట్లీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో  నయనతార  కథానాయికగా నటించగా  ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. సుమారు 180కోట్ల బడ్జెట్ తో  ఎజిఎస్  ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.  తమిళనాడు లో విజయ్ కి వున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో   ఈ చిత్రం  రికార్డు స్థాయిలో  ఓపెనింగ్స్ ను రాబట్టడం ఖాయంగా కనిపిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: