తమ హక్కులకు, మనోభావాలకు భంగం వాటిల్లితే స్పందించేవారి కంటే సమాజంలో జరిగే అన్యాయలపై స్పందించేవారికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా స్పందించేవారిలో సినీ పరిశ్రమలో కొంతమంది ఉన్నారు. వాళ్లలో మంచు లక్ష్మీ ప్రసన్న, సమంత, చిన్మయి శ్రీపాద.. ముందు వరుసలో ఉంటారు. అయితే.. ఒకే ఒక్క ట్వీట్ తో వీళ్ళకన్నా పై చేయి సాధించింది మెగా కోడలు ఉపాసన కొణిదెల. నిజానికి పై ముగ్గురి నుంచి రావాల్సిన స్పందన కరువైతే తనకు డైరెక్ట్ గా సంబంధం లేని విషయంపై స్పందించి శెభాష్ అనిపించుకుంది.

 

 

ఇటీవల భారత ప్రధాని మోదీ తన నివాసంలో బాలీవుడ్ స్టార్స్ కు గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దక్షిణాది భాషల చిత్ర పరిశ్రమ నుంచి ఎవరికీ ఆహ్వానం పంపకపోవటం తెలిసిన విషయమే. దక్షిణాదిని చిన్న చూపు చూస్తున్నారంటూ మొదట స్పందించి మోదీకి టాగ్ చేస్తూ ఉపాసన చేసిన ట్వీట్ వైరల్ అయింది. అయితే స్త్రీవాద హక్కులపై విరుచుకుపడే మంచు లక్ష్మీ, సమంత, చిన్మయి.. సినిమా పరిశ్రమకు సంబంధించిన వారై కూడా దీనిని ఖండించలేదు.. కనీసం స్పందించలేదు. దీనిపై నెటిజన్లు ఉపాసన ధైర్యాన్ని మెచ్చుకుంటూనే.. వీళ్ళందరూ ఎక్కడ అంటూ  కామెంట్లు చేస్తున్నారు.  ప్రధానితో వైరం ఎందుకని ఆగిపోయారా.. అంటూ పోస్టులు చేస్తున్నారు.

 

 

అర్జున్ రెడ్డి సినిమా సమయంలో చిన్మయి చేసిన రచ్చ తెలియంది కాదు. మిగిలినవారు.. సమాజంలో జరుగుతున్న అన్యాయంపై పలుమార్లు స్పందించిన వారే. మరి.. ఏకంగా దక్షిణాది చిత్ర పరిశ్రమకే జరిగిన అవమానంపై వీరు ఎందుకు స్పందించలేదో అర్థంకాని విషయం. అనవసర విషయాల కంటే వ్యవస్థకు జరిగిన అన్యాయంపై స్పందించిన ఉపాసన వారికంటే ఓ మెట్టు పైనే నిలిచిందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: