ఇప్పటికే రాబోయే సంక్రాంతి కానుకగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ల అల వైకుంఠపురములో సినిమాలు బరిలో నిలుస్తున్నట్లు అధికారికంగా ప్రకటనలు కూడా రావడం జరిగింది. అది మాత్రమే కాక ఈ రెండు సినిమాలు ఏకంగా ఒకే రోజున భారీ రేంజ్ లో రిలీజ్ అవుతుండడంతో, అందరి దృష్టి వీటిపైనే ఎక్కువగా ఉంది. ఇక వీటితో పాటు రజినీకాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దర్బార్, సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఎంత మంచివాడవురా, అలానే వెంకటేష్ మరియు నాగచైతన్య హీరోలుగా తెరకెక్కుతున్న వెంకీమామ సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధం అవుతున్నాయి. అయితే ఇక్కడే కొద్దిపాటి సమస్యలు తలెత్తడానికి ఆస్కారం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

ఇక వారు చెప్తున్న వివరాల ప్రకారం, తెలుగు వారు ఎంతో గొప్పగా జరుపుకునే అతి పెద్ద పండుగైన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయ్యే సినిమాలపై కూడా వారు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, అయితే ఈ బరిలో నిలిచి విజయవంతం అయ్యే సినిమాకు ఎంత అత్యద్భుతంగా కలెక్షన్స్ వస్తాయో, అపజయం పాలైన సినిమాకు అంత దారుణంగా కలెక్షన్స్ వస్తాయని, గతంలో ఎన్నో సార్లు ఇది నిరూపితం అయిందని అంటున్నారు. అది మాత్రమే కాక మహేష్ మరియు బన్నీల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతుండడంతో, థియేటర్స్ పంచుకునే విషయమై కూడా కొన్ని సమస్యలు తెలెత్తే అవకాశం లేకపోలేదని, అన్నిటికంటే ముఖ్యంగా దాని వలన ఓపెనింగ్స్ ఏ ఒక్క సినిమాకు కూడా భారీగా వచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. 

అయితే గతంలో కూడా ఈ విధంగానే పెద్ద సినిమాలు రెండు లేక మూడు, ఒకే రోజున రిలీజ్ అయినప్పటికీ, అప్పటి పరిస్థితులు వేరని, నేడు ఏ సినిమాకైనా 20 నుండి 30 రోజులు మాత్రమే కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంటుందని, కాబట్టి ఆ లోగానే రాబట్టదల్చుకుంది మొత్తం రాబట్టేలా ఆయా దర్శక నిర్మాతలు ప్లాన్ చేయాలని అంటున్నారు. అయితే యాదృచ్చికంగా ఈ రెండు భారీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతుండడంతో, వాటిలో సక్సెస్ అయ్యే సినిమాకు మాత్రం కాసుల పంట ఖాయమని అంటున్నారు. మరి వాటిలో ఏ సినిమా విజయవంతం అవుతుందో చూడాలి......!!


మరింత సమాచారం తెలుసుకోండి: