నైజం లో ప్రముఖ సినీ పంపిణి సంస్థ, ఏషియన్ సినిమాస్ ఇప్పుడు ఆదాయ శాఖ దాడులు ఎదురుకుంది. ఏషియన్ సినిమాస్ అధినేతల ఇళ్లపై ఆదాయపన్ను శాఖా అధికారులు దాడులు చేశారు. ఏషియన్ సినిమా అధినేతలు నారాయణదాస్ నారంగ్, సునీల్ నారంగ్ ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాల్లో ఐటి సోదాలు జరిగాయి. వారి ఇళ్లల్లో కీలకమైన పత్రాలు అధికారులు పరిశీలిస్తున్నారు.


చాలా ఏళ్లుగా సినిమాల పంపిణీదారులుగా ఉన్న ఈ సంస్థ ఏషియన్ సినిమాస్ పేరిట థియేటర్లు కూడా నడుపుతుంది. మొన్నీమధ్య మహేష్ బాబుతో కలసి ఏఎంబి మాల్ ను ఇదే సంస్థ ఏర్పాటు చేసింది. ఐటి సోదాల్లో భాగంగా కొండాపూర్ లోని ఏఎంబి సినిమాస్ లోను అధికారులు రికార్డులు తనిఖీ చేస్తున్నారు. లాభాలను తక్కువగా చూపించి పన్ను ఎగ్గొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యనే ఏషియన్ సినిమాస్ సినిమా నిర్మాణంలోకి కూడా అడుగుపెట్టింది. ఇక ఇదిలా ఉంటే ఎక్కువ‌గా పెద్ద పెద్ద వారు ఎందుక‌ని ఇలాంటి వ‌న్నీ చేస్తున్నారు. అవి కావాల‌ని అలా జ‌రుగుతుందా లేక దానికి సంబంధించి వాటిని ప‌రిశీలించి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌న్నులు అన్నీ క‌ట్టి చూసుకునేవారు త‌ప్పుచేస్తున్నారా అన్న‌ది తెలియ‌డంలేదు. గ‌తంలో కూడా ఒక‌సారి మ‌హేష్‌బాబు ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్న సంఘ‌ట‌న‌లు ఉన్నాయి.

అంటే వాళ్ళు కావాల‌ని చెయ్య‌రు కాని వారి ద‌గ్గ‌ర ఉన్న ఆడిట‌ర్లు ఇలాంటి వ‌న్నీ స‌రిగా చూసుకోక‌పోవ‌డం వ‌ల్లే ఇలాంటి త‌ప్పులు జ‌రుగుతున్నాయ‌ని కొంద‌రు వాదిస్తున్నారు కూడా.  ఇక మ‌రి ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ఏ ఎంబిమాల్ లాభాల్లో న‌డ‌వ‌డంలేదా. న‌ష్టాల్లో ఉందా అని కూడా కొంద‌రికి అనుమానాలు వ‌స్తున్నాయి. ఎందువ‌ల్ల‌నంటే సోదాలు చేస్తుండ‌గా లెక్క‌లు అన్నీ త‌క్కువ‌గా చూపించ‌డంతో కొన్ని అలాంటి అనుమానాలే వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ సంస్థ త్వరలో హీరో అల్లు అర్జున్‌తో కలిసి మల్టిప్లెక్స్‌ నిర్మాణం చేపట్టబోతున్నారు.  అలాగే నాగచైతన్య హీరోగా, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఏషియన్ సినిమాస్ సంస్థ సినిమాను నిర్మిస్తోంది.   నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయడంతోపాటు, ఏషియన్‌ సినిమాస్‌ పేరుతో థియేటర్లు నిర్మించింది ఈ సంస్థ.  


మరింత సమాచారం తెలుసుకోండి: