తమన్నా నటనాపరంగానే కాకుండా గ్లామర్ పరంగా కూడా ప్రఖ్యాతి గాంచింది. తెలుగులో హ్యాపీ డేస్, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, ఊసరవెల్లి వంటి సినిమాల్లో తన పాత్రలకి, తన నటనకి విమర్శకుల నుంచి సానుకూల స్పందన లభించింది. 2010లో తమన్నాని తమిళనాడు ప్రభుత్వం సినీరంగంలో తన సేవలకు కలైమామణి పురస్కారంతో సత్కరించింది.

 

తనతో కలిసి పనిచేసిన తారలు తన గురించి ఎప్పుడూ సానుకూలంగానే స్పందించారు. నేటి వరకూ తమన్నా ఉత్తమ నటి విభాగంలో 5 అవార్డులు గెలుచుకుంది. అదే విభాగంలో 11 అవార్డ్ నామినేషన్లను అందుకుంది. నటన మాత్రమే కాకుండా సినిమాల్లో తన నడుము, నాభి ప్రదర్శనకు తమన్నా ప్రసిద్ధి చెందింది. ఎన్నో సినిమాల్లో తన నడుము, నాభి ప్రదర్శించడానికి తమన్నా వెనుకాడలేదు.

 

అయితే రాజుగారి గది 3' తమన్నా కథానాయికగా మొదలయింది. అయితే ఆ తర్వాత తమన్నా తప్పుకోవడంతో ఓంకార్‌ ఇక స్టార్‌ హీరోయిన్‌ కోసం చూడలేదు. అసలు తమన్నా లాస్ట్‌ మినిట్‌లో ఎందుకు తప్పుకుందంటే... ఓపెనింగ్‌ అయిన తర్వాత తమన్నా కథ మార్చమని చెప్పిందట.

 

ఆమె వెళ్లిపోవడంతో హీరోయిన్‌ ప్రధాన కథని హీరో వైపు మార్చేసాడట. అలా తన తమ్ముడు అశ్విన్‌ని ఎలివేట్‌ చేసుకునే వీలు చిక్కిందని, ఇక అతడి సీన్లు పెంచుకుని తనకి కావాల్సినట్టుగా సినిమా తీసుకున్నానని, తమన్నా చేసి వుంటే ఎలా వుండేదనేది పక్కన పెడితే ఇప్పుడు హీరోగా అశ్విన్‌కి ఈ చిత్రం హెల్ప్‌ అయిందని ఓంకార్‌ అంటున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: