హైదరాబాద్ మహా నగరంలో చాలా థియేటర్లు అందుబాటులో ఉన్నాయి కానీ, ఇక్కడ భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న థియేటర్ అంటే గుర్తొచ్చేది మాత్రం మహేష్ బాబు  ఎఎంబీ మాత్రమే.. పెద్ద స్క్రీన్ ఉన్న ఈ హాల్ వెలుగులోకి వచ్చి కేవలం కొద్దిరోజులు అయినా కూడా బాగా పాపులారిటీని సంపాదించుకుంది.. దానికి కారణం సినీ తారల రాక ఇక్కడ ఎక్కువగా ఉండటమే..

ఇది ఇలా ఉండగా ఈ సినిమాస్ నిర్మాత సంస్థపై ఎసిబి ఆస్తాన్ని సంధించింది.. సినిమాస్ యాజమాన్యం లెక్కల్లో ఎక్కువ బొక్కలే ఉన్నాయని వారు వెల్లడించారు. ఇకపోతే ఈ సంస్థకు అధినేతగా ఉన్నవాళ్లు నారాయణదాస్ , సునీల్ మరియు వారి సన్నిహితుల ఇళ్లపై కూడా ఐటి దాడులు నిర్వహించారు.. ఈ సంస్థ ఏషియన్ మల్టీఫ్లేక్స్ యాజమాన్యంలో నడుస్తుంది..


అతిపెద్ద సినిమాస్ సంస్థ కాబట్టి సినీ స్టార్స్ తో కొత్తగా మాల్స్ కూడా ఏర్పాటు చేయించే పనిలో ఉన్నారు.అయితే ఈ సినిమాస్ కు మహేష్  కూడా పాట్నర్ గా ఉన్నారు.. ఆదాయం బాగా వచపడటంతో ప్రస్తుతం స్టయిలిష్ స్టార్ బన్నీ కూడా ఇందులో భాగస్వామ్యం కాబోతున్నారు . ఆదాయానికి మించి ఆస్తుల ఉన్నాయని ఎసిబి వెల్లడించింది. 


ఈ పెద్ద సంస్థ సినిమాలను నిర్మించడంలో కూడా బిజీగా వుంది .. ప్రస్తుతం చైతు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కూడా ఇక్కడే నిర్మిస్తున్నారు. అనుకోకుండా ఈ దాడులు జరగడంతో ఎసిబి కళ్ళకు ఎం చిక్కాయి.. అనేది మాత్రం ఎక్కడా బయటకి పొక్కలేదు.. మరి ఈ వ్యవహారం ఎంటో తెలియాల్సి ఉంది..ఐటి సోదాలు భారీగానే జరిగాయి మరి వాటిపై పూర్తి వివరాలు  తెలిస్తే గాని ఏంటి అనే విషయం మాత్రం తెలియదు..మహేష్ బాబు గొంతుకు కూడా ఉచ్చు బిగుసుకుంటుందా చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: