సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ కావాలంటే ఇండ‌స్ట్రీలో క‌నిపించే టాప్ హీరోయిన్ న‌య‌న‌తార. ప్ర‌స్తుతం టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతుంది. ఏదైనా పెద్ద స్టార్ సినిమా వ‌స్తే ముందుగా హీరోయిన్ కోసం న‌య‌న్‌ను సంప్ర‌దించాల్సిందే. అలాంటి న‌య‌న‌తార సినిమా ఒప్పుకునే ముందు నిర్మాత‌ల‌కు ఖ‌చ్చితంగా కండీష‌న్లు పెడుతుంది. త‌ను ఆడియో ఫంక్ష‌న్‌కు గానీ, సినిమా ప్ర‌మోష‌న్స్‌, స‌క్సెస్ మీట్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌న‌ని ముందే తేల్చేస్తుంది. అయినా టాలీవుడ్‌, కోలీవుడ్ నిర్మాత‌లు న‌య‌న్ కండిష‌న్‌ను సంతోషంగా ఒప్పుకుంటారు. ఎందుకంటే న‌య‌నతార సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పొల్గొన‌క‌పోవ‌డం వ‌ల్ల సినిమా ఖ‌చ్చితంగా హిట్ట‌వుతుంద‌నే సెంటీమెంట్ ప్ర‌బ‌లింది. అందుకే న‌య‌న కెరీర్ కూడా హ్యాపీగా దూసుకెళ్లిపోతుంది.


ఇక ఇదిలా ఉంటే... దక్షిణాదిన అగ్రతారగా కొనసాగుతున్న నయనతారకు బాలీవుడ్ నటి కత్రినాకైఫ్ ధన్యవాదాలు తెలిపింది. వివరాల్లోకి వెళ్తే, బాలీవుడ్ లో బిజీగా ఉన్న కత్రిన సౌందర్య ఉత్పత్తుల వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. 'కే బై కత్రిన' పేరుతో తన సొంత బ్రాండ్ ను ప్రారంభించింది. తన ప్రాడక్ట్స్ ప్రచారం కోసం నయనతారతో కలిసి ఓ వీడియోను రూపొందించింది. సినిమా షూటింగులతో బిజీగా ఉన్న నయనతార... ముంబైకి వచ్చి షూటింగ్ లో పాల్గొనడంపై కత్రిన థ్యాంక్స్ చెప్పింది. దక్షిణాది అందమైన నటికి ధన్యవాదాలు అని సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీంతో పాటు షూటింగ్ సందర్భంగా తీసిన ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇక ఈ ఇద్ద‌రు భామ‌లు క‌లిసి చేసే ఈ యాడ్ ఆ ప్రాడ‌క్ట్స్ ఎంత మాత్రం స‌క్సెస్ అవుతాయో చూద్దాం మ‌రి.


తాజాగా ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు విగ్నేశ్‌ శివన్‌ సోషల్‌మీడియాలో పెట్టిన్‌ పోస్ట్‌ చూస్తే త్వరలో వీరిద్దరూ పెళ్లి పీటలెక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. న‌టి నయన్‌తార‌, విగ్నేశ్‌లు నల్ల టోపీలు పెట్టుకుని దిగిన ఫొటోను విగ్నేశ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ..హే..నాకు పెళ్లి వయసు వచ్చింది. నీకోసం ఎదురుచూడనా అని తమిళంలో క్యాప్షన్‌ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: