ఈరోజు తో ప్రభాస్ 40 సంవత్సరాలు పూర్తిచేసుకొని 41వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలుపుతూ అతడి టాలెంట్‌ని ఆకాశానికి ఎత్తేస్తూ అనేకమంది ప్రముఖ సెలెబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ బండ్ల గణేష్ ప్రభాస్ కు బండ్ల గణేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసి అతడిని బుట్టలో పడేయడానికి ప్రయత్నం చేసాడు. 

సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌ గా ఉండే వెన్నెల కిషోర్ ప్రభాస్‌ కి తన విషెస్ తెలుపుతూ ‘మన డార్లింగ్ ప్రభాస్‌ కి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ ట్విట్ చేసాడు.  అయితే వీరందరికంటే ఒక అడుగు ముందుకు వేసి మెగా మేనల్లడు సాయి ధరమ్ తేజ్ చేసిన ట్విట్ ఇప్పుడు ప్రభాస్ అభిమానుల మధ్య వైరల్ గా మారింది. 

సాయి ధరమ్ తేజ్ ప్రభాస్‌ని ‘అన్న’ అని సంబోధిస్తూ బర్త్ డే విషెష్ తెసుభాకాంక్షలలో సాయి ధరమ్ తేజ్ మంచి మనసు కనిపిస్తోంది అంటూ ప్రభాస్ అభిమానులు సాయి తేజ్ పై అభిమాన్నాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఇక వీరు మాత్రమే కాకుండా అనేక మంది సినిమా సెలెబ్రెటీలు ప్రభాస్ కు శుభాకాంక్షలు తెలియచేసారు. 

ఇంతవరకు బాగానే ఉన్నా  ప్రభాస్ జిల్ రాధకృష్ణల లేటెస్ట్ మూవీకి సంబంధించిన టైటిల్ ప్రకటన ఈరోజు ఉంటుంది అని భావించిన ప్రభాస్ అభిమానులకు ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈసినిమా టైటిల్ కు సంబంధించి ఇంకా ఎటువంటి ఫస్ట్ లుక్ విడుదల కాకపోవడంతో ప్రభాస్ పుట్టినరోజునాడు కూడ తమకు అసంతృప్తి మిగిలిందా అంటూ అభిమానులు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఈ సాయంత్రం లోపుగా ప్రభాస్ కొత్త మూవీ టైటిల్ ప్రకటన వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు..
 



మరింత సమాచారం తెలుసుకోండి: