'బాహుబలి' తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలసి నటిస్తున్న భారీ మల్టీస్టారర్ సినిమా RRR. బాహుబలి తో భారీ విజయం మరియు భారీ క్రేజ్ దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో దిగ్గజ దర్శకుడు రాజమౌళి దక్కించుకోవడం తో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ ఇంట్రెస్ట్ నెలకొంది. ఇదిలా ఉండగా ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మాణమవుతున్న క్రమంలో ఈ సినిమాకు డైరెక్టర్ మరియు జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వినపడుతున్నాయి.


బయటకు వచ్చిన వార్తల ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు ఈ సినిమాకి గాను చెరొక పాతిక కోట్ల  రెమ్యునరేషన్ ఇస్తున్నారని అంటున్నారు. దీంతో పాటు ఎక్కువ కాలం సినిమా కోసం టైం కేటాయించాల్సి వస్తున్న కారణంగా నెలకు పది లక్షల చొప్పున ఇద్దరు హీరోలకు షూటింగ్ ఖర్చుల కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా షూటింగ్ కి ఎన్ని రోజులు హాజరైతే అన్ని రోజులు ఇద్దరి హీరోలకు పది లక్షల చొప్పున ఇవ్వడానికి నిర్మాత సిద్ధమైనట్లు ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.


అంటే రెమ్యునరేషన్ కాకుండా ఇది అదనంగా వస్తోన్న డబ్బన్నమాట. మరి డైరెక్టర్ గా పని చేస్తోన్న రాజమౌళికి ఎంత రెమ్యునరేషన్ ఉంటుందనే విషయంపై ఆరా తీయగా.. అతడికి అసలు పారితోషికం లేదని.. లాభాల్లో సగం వాటా ఆయనకే అని నిర్మాణ వర్గాల నుండి వస్తున్న సమాచారం. ఈ సినిమాకి బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీ అందించగా ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. రాబోయే సంవత్సరం జులై మాసం 30వ తారీఖున ఈ సినిమాని విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: