ప్రభాస్ ఫైనల్ గా నాలుగు పదుల వయసులోకి వచ్చేశాడు. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ప్రభాస్ కి  విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో  హల్ చల్ చేస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీకి  ప్రభాస్ నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు. అతి కొద్దీ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును లభించుకోవడం జరిగింది. ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. నేడు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దామా మరి...


నిజానికి ప్రభాస్ హీరో అవుదామని అస్సలు అనుకోలేదు అంట. తనకు సినిమాల్లో నటించాలని ఆలోచన ఉండేది కాదు అట. కానీ ఎప్పుడు ఇంట్లో ఒక పక్క పెదనాన్న కృష్ణంరాజు హీరో. తండ్రి సూర్య నారాయణరాజు నిర్మాత కావడంతో ఎప్పుడూ  ఇంట్లో సినిమా వాతావరణమే ఉండేది. అయినా కూడా హీరో అయిపోదాం అని కలలో కూడా ఎప్పుడు అనుకోలేదు అంట. ఇక చదువు పూర్తవగానే, ఒక రోజు ఏం జరిగిందో తెలియదు సడెన్ హీరో అవ్వాలి అని అనిపించింది అంట. 


ఈ విషయం గురించి పెదనాన్నకు చెబితే మాత్రం  ఆయనతో సహా ఇంట్లో వారు అందరికి  కూడా అనుమతి ఇచ్చారు. నటించాలని ఉంటే ముందు నటనలో శిక్షణ తీసుకోమని విశాఖలోని సత్యానంద్ గారి దగ్గరకు పంపించడం జరిగింది. ప్రభాస్ నటన శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే కూడా నిర్మాత అశోక్ కుమార్ సినిమా చేద్దాము అని అన్నారు కానీ మొదటిలో వద్దు అని చెప్పారట. కానీ,  కృష్ణంరాజు నచ్చజెప్పడంతో ఇంకా  శిక్షణ పూర్తి కాకుండానే ఈశ్వర్ సినిమాలో నటించడం జరిగింది.


ఆలా అడుగు పెట్టిన ప్రభాస్ తెలుగు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ లభించుకోవడం జరిగింది. ఈశ్వర్, చక్రం, ఛత్రపతి, వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, రెబల్, మున్నా, బిల్లా, మిర్చి, బాహుబలి ఇలా అన్ని సినిమాలతో  ప్రేక్షకులను అందరినీ  ఆకట్టుకున్నాడు ప్రభాస్. ప్రభాస్ కు అత్యంత ఇష్టమైన పండగల్లో దీపావళి ఒకటి అంట. ఆ రోజు కొత్త వాళ్లు ఎవరైనా ప్రభాస్ ను చూస్తే చాల భయపడిపోతారట. ఎందుకంటే ఆరోజు ఫ్రెండ్స్, బంధువులతో కలిసి రచ్చ రచ్చ చేస్తాడు అంట. 


మరింత సమాచారం తెలుసుకోండి: