ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా. దేవదాసు సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఇల్లీ బేబీ... తర్వాత చాలామంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసింది . అయితే కొన్ని రోజులు టాప్ హీరోయిన్గా కూడా కొనసాగింది. ఇక ఆ తర్వాత ఈ గోవా బ్యూటీ కి టాలీవుడ్ లో సరైన అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో తన లక్కు  పరీక్షించుకుందామని అక్కడికి వెళ్ళింది. సన్నజాజి లా ఉండే ఈ అమ్మడు బాలీవుడ్ కి వెళ్ళిన తర్వాత బొండుమల్లెలు మారిపోయింది. తన నడుము వంపులతో కుర్రకారు మతి పోగొట్టిన ఇలియానా... బొద్దుగా మారిపోవడంతో అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. అందుకే రవితేజ తో జోడీ కట్టి అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాతో టాలీవుడ్ కి రీ ఏంట్రీ ఇచ్చినప్పటికీ  ఆదరించలేదు ప్రేక్షకులు. 

 

 

 

 అయితే ఇల్లీ బేబీ బాలీవుడ్ కి  ఎంట్రి చాలానే సినిమాలు చేసినప్పటికీ అక్కడ కూడా ఈ అమ్మడికి లక్కు కలిసి రాలేదు. దీంతో ఈ గోవా బ్యూటీ నటించిన సినిమాలన్నీ ప్రేక్షకులను  ఆకట్టుకోలేకపోవడంతో... అక్కడ అవకాశాలు కరువయ్యాయి ఈ అమ్మడికి. అంతేకాకుండా చాలా కాలంగా విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ఇలియానా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తన ప్రియుడు ఆండ్రూ నిబోస్ తో  బ్రేకప్ కావడంతో... ఇలియానా తన మనసు మార్చుకుని సినిమాలపై దృష్టి పెట్టేందుకు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తన అభిమానులకు అందరికీ ఇష్టమైన ఆ నడుము వంపులను చూపించేందుకు సన్నబడుతుంది ఇలియానా. అయితే ప్రస్తుతం ఇల్లీ బేబీ పాగల్ పంతి  అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తుంది. 

 

 

 

 

 అయితే గతంలో సెక్స్ కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసింది ఇలియానా . ఇక తాజాగా ది లవ్ లాఫ్  అనే కార్యక్రమంలో పాల్గొన్న ఇలియానా... తన పర్సనల్ ప్రొఫెషనల్ జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టింది. కాగా ప్రస్తుతం ఇల్లీ బేబీ చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి . అయితే గతంలో శృంగారానికి ప్రేమకు సంబంధం లేదని ఇలియానా అన్న వ్యాఖ్యల గురించి ఆ షోలో యాంకర్ ఇలియానా తో  ప్రస్తావించగా... ఇద్దరి మధ్య కాస్త ఎమోషన్స్ ఉంటేనే సెక్స్ ని ఎంజాయ్ చేయగలమని ఇల్లీ బేబీ మళ్లీ చెప్పింది. అలాగే తనకు పూలంటే ఇష్టం అని... తాను చాలా మంది తో డేటింగ్ చేశాను కానీ తన బాయ్ ఫ్రెండ్స్  ఎవరు ఇప్పటివరకు తనకు పువ్వులు  ఇవ్వలేదని ఇలియానా తెలిపింది . అయితే తనకు గుర్తు ఉన్నందుకు తన తండ్రి మాత్రమే పూలను ఇచ్చేవాడని ఇలియానా తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: