ఒకప్పటి అగ్రతారగా ఎన్నో సినిమాల్లో నటించి హీరోల రేంజ్లో ప్రేక్షకాదరణ పొందింది డైనమిక్ నటి విజయశాంతి. అలనాటి అగ్రతారగా టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగింది విజయశాంతి. ఒకప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు దర్శకులకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విజయశాంతి... ఎన్నో  లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సినీ ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఇక తన నటనతో  తెలుగు ప్రేక్షకులందరి మనుసుల్లో  ఒసేయ్ రాములమ్మగా ముద్ర వేసుకుంది. అందం అభినయం కలగలిపిన నిన్నటి తరం కథానాయికలలో ఒకరైన విజయశాంతి... సడన్గా సినిమాలకి గుడ్ బై చెప్పి రాజకీయాలోకి వెళ్ళిపోయింది. 

 

 

విజయశాంతి చివరగా 2006 లో నాయుడమ్మ అనే సినిమాలో నటించింది. అయితే దాదాపు 13 ఏళ్ళ తర్వాత మళ్లి సినిమాల్లోకి రీ ఏంట్రీ ఇవ్వబోతుంది. సరిలేరు నీకెవ్వరు...సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించనుంది. సినిమాలో విజయశాంతి రాయలసీమకు చెందిన పవర్ ఫుల్ పాత్రలో నటించనుంది.  అయితే 13 ఏళ్ళ  తర్వాత సినిమాల్లోకి  రీ ఏంట్రీ  ఇస్తుండడం... రాయలసీమకు చెందిన ఓ  పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండడం తో విజయశాంతి ఫస్ట్ లుక్ ఎప్పుడు బయటకు వస్తుందా  అని విజయశాంతి అభిమానులు వేయి  కళ్ళతో ఎదురు చూస్తున్నారు. 

 

 

 

 విజయశాంతి  ఫస్ట్ లుక్ ఎలా ఉంటుంది తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. అయితే దీపావళికి అభిమానులకు కోరిక తీరేలా ఉంది . దీపావళి పండుగ సందర్భంగా చిత్ర బృందం  విజయశాంతి ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు సమాచారం. మహేష్ బాబు రష్మిక జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నారు. కాగా  మొదటి సారి మహేష్ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: