తమిళ స్టార్ హీరో సూర్య  నటించిన లేటెస్ట్ మూవీ కాప్పాన్ ఇటీవల  విడుదలై కోలీవుడ్ లో మంచి వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.  హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా  రంగం ఫేమ్ కెవి ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం లో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ , బోమన్ ఇరానీ , ఆర్య  ముఖ్య పాత్రల్లో నటించగా  హారిస్ జైరాజ్ సంగీతం అందించాడు.  భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.  ఇక ఈ చిత్రం ఈనెల 27న అమెజాన్ ప్రైమ్ లో విడుదలకానుంది. కాగా తెలుగులో బందోబస్త్ పేరు తో విడుదలైన ఈ చిత్రం సూర్య కెరీర్ లోనే భారీ డిజాస్టర్ సినిమా అయ్యింది.  ప్రమోషన్స్  సరిగా లేకపోవడం అలాగే  గత కొంత కాలంగా  సూర్య నటించిన  సినిమాలు బాక్సాఫీస్  వద్ద  బోల్తా కొట్టడం తో  బందోబస్త్ కు బజ్ రాలేదు. దాంతో  ఈసినిమా చూడడానికి తెలుగు ప్రేక్షకులు ఆసక్తిని కనబర్చలేదు.  ఇక ఈ చిత్రం తో  సూర్య తెలుగు మార్కెట్ దారుణంగా పడిపోయింది. 




ఇదిలా ఉంటే  మరో తమిళ హీరో  ధనుష్ నటించిన అసురన్ కూడా నవంబర్ 8న ప్రైమ్ లోకి రానుందని సమాచారం. అక్టోబర్ నాలుగున విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ టాక్ తో 65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి  ధనుష్ కు కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని అందించింది.  రూరల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామా గా తెరకెక్కిన ఈచిత్రాన్ని వెట్రిమారన్ డైరెక్ట్ చేయగా  మలయాళ నటి  మంజు వారియర్ ,ధనుష్ కు జోడీగా నటించింది.  ఇక ఈ చిత్రం తెలుగులో  విడుదలకాలేదు కానీ  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్సినిమా తెలుగు రీమేక్ లో నటించడానికి ఆసక్తిచూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈరీమేక్ విషయంలో ఓ క్లారిటీ రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: