తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ సినీరంగ ప్రముఖుల తో సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. చేంజ్ వితిన్ అనే పేరుతో ఈ కార్యక్రమం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడు ఆలోచనలను  సినిమాలు ఇతర ప్రచార మాధ్యమాల  ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సమావేశం నిర్వహించారూ మోడీ . అయితే ఈ సమావేశానికి బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్ షారుక్ ఖాన్ తో పాటు చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఈ సమావేశం పట్ల రామ్ చరణ్ సతీమణి ఉపాసన మండిపడ్డ సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి బాలీవుడ్ నటులను ఆహ్వానించిన మోడీ...  దక్షిణాది తారలను మాత్రం ఎందుకు మరిచారని... దక్షిణాది సినీ పరిశ్రమ అంటే మీకు ఎందుకు అంత వివక్ష అంటూ మోదీని ప్రశ్నిస్తూ  ట్విట్టర్ వేదికగా  ఓ ట్విట్ చేసింది  ఉపాసన. 



 దక్షిణ చలన చిత్ర పరిశ్రమను  కూడా ప్రధాని మోదీ గౌరవించాలని తెలిపింది. సౌత్ ఇండస్ట్రీ పై చిన్న చూపు ఎందుకు అంటూ ఉపాసన ట్విట్టర్ వేదికగా ప్రధాని మోదీ ప్రశ్నించింది. అయితే రామ్ చరణ్ సతీమణి ఉపాసన మోదీకి ట్విట్టర్ ద్వార ప్రశ్నించడంతో ఇది సంచలనంగా మారింది. కాగా  ఇప్పుడు మరో నటి మోదీకి ఇదే విషయంపై ప్రశ్నించింది. తెలుగు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న నటి ఖుష్బూ... ప్రధాని మోదీ ని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించింది. 



 దేశవ్యాప్తంగా దక్షిణాది చిత్ర పరిశ్రమ ప్రాతినిధ్యం వహిస్తుందని... దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి చాలా పెద్ద సూపర్ స్టార్స్ కూడా వచ్చారని  తెలిపింది.  ఇండియా లోనే బెస్ట్ యాక్టర్స్ కూడా సౌత్ ఇండస్ట్రీ నుంచి ఉన్నారని కుష్బూ  తెలిపింది. అంతే కాకుండా బెస్ట్ టెక్నీషియన్స్ కూడా దక్షిణ భారతదేశం లోనే ఉన్నారని తెలిపింది కుష్బూ. అలాంటప్పుడు సౌత్ ఇండియన్ స్టార్స్ ని ఎందుకు ఆహ్వానించలేదు అంటూ మోదీని ప్రశ్నించింది. సౌత్ ఇండియన్  స్టార్స్  విషయంలో ఎందుకింత చిన్న చూపు.... ఎందుకంత  అసమానత్వం అంటూ కుష్బూ  మండిపడ్డారు. అంతేకాకుండా మోడీ సమావేశానికి వెళ్లిన బాలీవుడ్ తారలు అందరూ ఒకసారి ఈ విషయంపై ఆలోచించాలని తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి: