టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో వరుస సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. అయితే మహేష్ నుండి కొన్నేళ్లుగా మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ మాత్రం రాలేదనే చెప్పాలి. ఇక అభిమానులు మరియు ప్రేక్షకులు ఎప్పటినుండో ఆయన ఒక మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన కమర్షియల్ సినిమా చేస్తే చూడాలని ఆశపడుతున్నారు. అయితే ఎట్టకేలకు అందరి ఆశలను ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమా తీర్చబోతోంది. 

మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, రాజేంద్ర ప్రసాద్, సంగీత, మురళి శర్మ తదితరులు ఇతర క్యారెక్టర్స్ పోషిస్తున్నారు. అయితే ఇది విజయశాంతి కం బ్యాక్ మూవీ కావడంతో ఆమె లుక్ ఎలా ఉంటుందో, అలానే ఆమె పాత్ర ఏమై ఉంటుందో అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మరొక నాలుగు రోజుల్లో దీపావళి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు టీమ్ ఆమె లుక్ ని రివీల్ చేయబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల టాక్. 

ఇప్పటికే దీపావళి సందర్భంగా ఒక సర్ప్రైజింగ్ ట్రీట్ సిద్ధం చేస్తున్నాం అని ప్రకటన రిలీజ్ చేసిన సరిలేరు టీమ్, ఆ రోజున విజయశాంతి గారి పవర్ ఫుల్ లుక్ ని రిలీజ్ చేయబోతోందట. కాగా విజయశాంతి ఈ సినిమాలో రాయలసీమలోని కర్నూలు ప్రాంతానికి చెందిన ఒక పవర్ఫుల్ లేడీగా దర్శనమివ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఏర్పరుచుకున్న ఈ సినిమా, రేపు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి, ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: