ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అనే పదానికి సరిగ్గా సరిపోయే హీరోయిన్  పాయల్ రాజ్ పుత్. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి  ఎదిగింది పాయల్  రాజ్ పుత్. తొలి చిత్రంలోనే ఎన్నో సంచలనాలు సృష్టించింది. మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది ఈ పంజాబీ భామ. ఆర్ఎక్స్ 100 సినిమా తో అందాల విందు పెట్టింది ప్రేక్షకులకు . అంతే కాకుండా తన అభినయంతో  నటనతోనూ మెప్పించింది  ఈ భామ. మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తోనే బోల్డ్ పాత్రలో నటించి... సంచలనం సృష్టించింది ఈ అమ్మడు. తాజాగా ఆర్డీఎక్స్ లవ్ అనే చిత్రంలో మరోమారు ప్రేక్షకుల ముందుకు వచ్చింది పాయల్  పాప. అయితే ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.  



 అయితే తాజాగా పాయల్ రాజ్ పుత్ ఒక మీడియా చానల్ కు  ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. లక్ష రూపాయలు తన దగ్గర పెట్టుకొని సినీ అవకాశాల కోసం వెతుక్కుంటూ ముంబైలో అడుగుపెట్టిందట  పాయల్ రాజ్ పుత్. ఆ డబ్బు సంపాదించడం ఏడాది కష్టపడిందట.... ప్రకటనల్లో నటించటం,  మరెన్నో వేదికలపై వ్యాఖ్యాతగా కూడా చేశాను అని చెపీకొచ్చింది  పాయల్  పాపా. అలా  తాను నిరూపించుకోవడానికి దొరికిన ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకున్నానని తెలిపింది పాయల్ రాజ్ పుత్. అయితే తెలుగు తమిళ చిత్రసీమలో ఎన్నో ఆడిషన్స్ హాజరయ్యానన్న  పాయల్ రాజ్ పుత్... ప్రతిచోటా ఆమెను తిరస్కరించారని తెలిపింది.



 చివరికి ఆర్ఎక్స్ 100 సినిమాలో ఛాన్స్ దొరికిందని తెలిపింది. ఆ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించడంతో తనకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది అని చెప్పింది. ఈ సందర్భంగా తనకి కాబోయే వాడు ఎలా ఉండాలన్న దానిపై క్లారిటీ ఇచ్చింది ఈ అమ్మడు . తనను చేసుకోబోయే వాడు అందంగా ఉండటంతో పాటు...తన కి  సరిపడా ఎత్తు ఉంటే చాలట. హాస్య చతురత కలిగి ఉండి... ఏ విషయంలో అయినా తాను అలిగితే బుజ్జగించాలట . అయితే భవిష్యత్తులో కచ్చితంగా ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పిన పాయల్ రాజ్ పుత్...  సినిమా ఇండస్ట్రీ వాళ్ళను మాత్రం చేసుకోను అని చెప్పింది. అయితే తనది ఉమ్మడి కుటుంబం అని ఏ పండుగైనా చాలా గ్రాండ్ గా నిర్వహిస్తారు అని తెలిపింది.  దీపావళి దసరా పండుగ అయితే మరింత ప్రత్యేకంగా చేస్తారని తెలిపింది పాయల్ రాజ్ పుత్. అయితే పాయల్ రాజ్ పుత్ వంటలు కూడా బాగా చేస్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: