డ్రీమ్గర్ల్ అంటే ఆనాడూ ఈనాడూ ఒకే ఒక్కరు ఉంటారు. ఆమె హేమమాలిని. అందానికి మారుపేరుగా నిలిచి దశాబ్దాల పాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో సొగసు జిలుగులు నింపిన హేమమాలిని అంటే 70 దశ‌సకంలో కుర్ర కారు వెర్రెక్కిపోయేవారు. ఆమె సినిమాలు వస్తే చాలు చూసేందుకు ఎగబడేవారు. పక్కన హీరో ఎవరు అన్నది కూడా చూడకుండా హేమమాలిని కోసమే సినిమాలకు వెళ్ళిన చరిత్ర నాడు ఉంది. అలా మొత్తం బాలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా అందాల రాణిలా హేమ రాజ్యమేలింది.


ఇక బాలీవుడ్లో ఎందరో హీరోలు హేమమాలినీని పెళ్ళి చేసుకునేందుకు రెడీ అయ్యారు. వారంతా పోటీ పడి మరి హేమ కళ్ళలో పడాలనుకునేవారు. వారిలో ద గ్రేట్ హీరో సంజీవ్ కుమార్ కూడా ఉన్నారు. మరో వైపు జితేంద్ర కూడా హేమ కోసం మనసు పారేసుకున్నారు. జితేంద్ర అయితే ఏకంగా హేమమాలినిని మద్రాస్ లో పెళ్ళి చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసేసుకున్నారట


దీంతో అప్పటికే షోలే, సీతా అవుర్ గీతా దిలాగీ, డ్రీమ్‌గర్ల్‌ వంటి చిత్రాల్లో జంటగా నటించిన ధర్మేంద్ర హేమమాలినితో పీకల్లోతు ప్రేమలో పడ్డారట. ఇక జితేంద్ర పెళ్ళిని హేమతో చెడగొట్టి మరీ ధర్మేంద్ర ఆమెను తన రెండవ భార్యగా చేసేసుకున్నారు. వీరి వివాహాం 1079లో జరిగింది. నాటి నుంచి ఈ జంట కన్నుల పంటలాగా వెలుగొందుతూ వచ్చింది.


తమ మధ్య ఎటువంటి  పొరపొచ్చాలు లేవని హేమ చెప్పుకొచ్చింది. తాము కుటుంబం అంతా ఒక్కటిగా ఉన్నామని, తమది సంతోషకరమైన జీవితం అంటోంది. తాను ఇంతవరకూ సినిమాలు, రాజకీయాలు ఇలా చాలా కాలం పనిచేసి అలాసిపోయాయని, ఇపుడు తన‌ కూతుళ్ళు, మనవళ్ళతో గడుపుతానని హేమమాలిని తాజాగా చెప్పుకొచ్చింది. మొత్తానికి హేమామాలిని డ్రీమ్  గర్ల్ అన్న మాటకు అసలైన అర్ధంగా నిలిచిందని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: