తమిళ దళపతి
విజయ్ కొత్త సంచలనాలకు తెరతీశారు. తెరీ, మెర్సల్ తర్వాత సంచలన దర్శకుడు అట్లీతో కలిసి ‘బిజిల్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్లో నటించారు విజయ్. ఈ మూవీ ట్రైలర్‌ను గత శనివారం తమిళ్లో విడుదలై పాత రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. ఒలంపిక్స్ నేపథ్యం ఉన్న కథలో విజయ్.. ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా, రౌడీగా, నాయకుడిగా కనిపిస్తున్నారు. కళ్లు చెదిరే యాక్షన్స్ ఎపిసోడ్‌తో
విజిల్ వేయిస్తున్నాడు విజయ్. ఈ చిత్రంలో
విజయ్ సరసన
నయనతార నటించగా.. వివేక్, యోగిబాబు, డేనియల్
బాలాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరాలను సమకూర్చారు.
తమిళ్‌తో పాటు తెలుగులోనూ విజయ్‌కి మంచి క్రేజ్ ఉండటంతో ఈ మూవీని తెలుగులో ‘విజిల్’ పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో
విజయ్ మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో మెస్మరైజ్ చేస్తున్నారు.
మొదటి చిత్రం
రాజా రాణి తో ఓ విభిన్నమైన ప్రేమకథను తెరకెక్కించి అందరినీ ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ స్టార్ హీరో తలపతి
విజయ్ తో తేరి చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీ విజయం తరువాత
విజయ్ అట్లీతో మరో మూవీ మెర్సల్ చేయగా ఆ చిత్రం కూడా బంపర్ హిట్ సాధించింది. అదిరింది పేరుతో తెలుగులో విడువులైన ఈ చిత్రం మొదటిసారి
విజయ్ కి తెలుగులో కూడా హిట్ అందించింది. ఈ హిట్ కాంబినేషన్ వస్తున్న హ్యాట్రిక్ మూవీ
బిగిల్ ఇంకా రెండు రోజులలో
దీపావళి కానుకగా విడుదల కానుంది.
ఐతే ఈ టాలెంటెడ్ దర్శకుడు ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. కాగా నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన
విజిల్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో అట్లీ ఈ చిత్రంపై హింట్ ఇచ్చారు. ఆయన త్వరలోనే
ఎన్టీఆర్ తో మూవీ చేసే అవకాశం కలదని చెప్పారు. దీనితో వీరిద్దరి కాంబినేషన్ లో ఖచ్చితంగా మూవీ ఉంటుంది అనే విషయం స్పష్టం అయ్యింది.