త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం `విజిల్‌``. పోలీస్‌(తెరి), అదిరింది(మెర్స‌ల్‌) వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల త‌ర్వాత విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా `బిగిల్‌`. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గ‌ణేశ్‌, క‌ల్పాతి ఎస్‌.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని `విజిల్‌`గా  ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్బంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం అక్టోబ‌ర్ 25న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో...


డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ - ``నేను అట్లీగారి సినిమాల‌కు పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌న డైరెక్ట్ చేసిన రాజా రాణి సినిమా నుండి ప్ర‌తి సినిమాను చూస్తూనే ఉన్నాను. విజ‌య్‌గారితో ఆయ‌న చేసిన సినిమాల‌కు తెలుగులో పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. విజిల్ సినిమా ట్రైల‌ర్ చూడ‌గానే గూజ్‌బామ్స్ వ‌చ్చాయి. అట్లీగారు సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించార‌ని అర్థ‌మైంది. అట్లీగారి కెరీర్ బెస్ట్ మూవీగా ఇది నిలుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించే అట్లీగారు .. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో పాటు హై ఎమోష‌న్స్‌ను ఈ సినిమాలో చూపిస్తున్నారు. క‌చ్చితంగా ఈ సినిమాను ఎంటైర్ ఇండియాలోని ప్రేక్ష‌కులు అభినందిస్తారు. అందులో అంత బ‌ల‌మైన కాంటెస్ట్ ఉంది. ఓ రైట‌ర్‌గా, డైరెక్ట‌ర్‌గా కంటే.. ఓ ఫ్యాన్‌గా `విజిల్‌` సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. అలాగే అట్లీగారు త్వ‌ర‌లోనే షారూక్ ఖాన్‌తో సినిమా చేయ‌బోతున్నారు. నేను షారూక్ అభిమానిగా ఈ కాంబో కోసం ఎదురుచూస్తున్నాను. నిర్మాత మ‌హేష్ నాకు కంటెంట్ రైట‌ర్ నుండి ప‌రిచ‌యం ఇప్పుడు త‌ను నిర్మాత‌గా మారాడు. త‌న‌కు ఆల్ ది బెస్ట్‌`` అన్నారు. 

డైరెక్ట‌ర్ అట్లీ మాట్లాడుతూ - ``నేను తెలుగులో సినిమా చేయాల‌ని చాలా కాలంగా క‌ల కంటున్నాను. త్వ‌ర‌లోనే ఆ క‌ల నేర‌వేర‌నుంది. ఎన్టీఆర్‌గారు చాలా మంచి హృద‌య‌మున్న వ్య‌క్తి. నా ప్ర‌తి సినిమాకు ఆయ‌న ఫోన్ చేసి అభినందిస్తుంటారు. నాపై చూపిస్తున్న‌ప్రేమ‌కు థ్యాంక్స్‌. ఈ కార‌ణంగానే నేను తెలుగులో సినిమా చేయాల‌నుకుంటున్నాను. తెలుగు ప్రేక్ష‌కులు చాలా గొప్ప‌గా ప్రేమిస్తారు. దాన్ని వెల‌క‌ట్ట‌లేం. ఇక విజిల్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమాను తెలుగులో 700 థియేటర్స్‌లో విడుద‌ల చేస్తుండ‌టం గొప్ప‌గా అనిపిస్తుంది. నిర్మాత అఘోరామ్ సార్‌కి థ్యాంక్స్‌. నేను ఏద‌డిగినా అది ఇచ్చారు. త‌ర్వాత నా బ్ర‌ద‌ర్ విజ‌య్ అన్న‌కు థ్యాంక్స్‌. ఆయ‌న లేకుండా నేను లేను.  ఆయ‌న వ‌ల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. విజ‌య్ అనేది యాక్ష‌న్ డ్రామా ఎమోష‌న్స్ ఉన్న స్పోర్ట్స్ మూవీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: