వెంకటేష్-నాగచైతన్య కాంబినేషన్ లో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీ వెంకీ మామ. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రేజీ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్స్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయమై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. నవంబర్ లో విడుదల అంటే... కాదు డిసెంబర్ లో అని కొంతమంది....కాదు సంక్రాంతికి విడుదల అని మరికొంతమంది ఇలా.... రకరకాల వార్తలతో వెంకీ మామ హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే....


ఈ క్రేజీ మూవీని డిసెంబర్ 11న విడుదల చేయాలనీ అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసి నాగ్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. కారణం... ఈ సినిమాని సంక్రాంతికి వస్తుందని, మంచి కలెక్షన్స్ వస్తాయని ఆశపడ్డారు. ఇప్పుడు సంక్రాంతికిర విడుద‌ల‌ అవడం లేదని తెలిసి డీలా అయ్యారట. ఇక మ‌రి మామాఅల్లుళ్ల ప్లాన్ ఏంట‌న్న‌ది తెలియాలి మ‌రి. అయితే ఈ చిత్రంలో రానా గెస్ట్ అప్పీయరెన్స్‌ ఇవ్వనున్నాడు. ఎప్పటినుంచే వెంకటేష్‌ సినిమాలో నటించాలని ఉందని రానా ఇప్పటికే పలుమార్లు చెప్పాడు. ఇంతకముందే రానా నటించిన ‘కృష్ణంవందే జగద్గురుమ్‌’ చిత్రంలో వెంకటేష్‌ గెస్ట్ అప్పీయరెన్స్‌ ఇచ్చాడు. ఇప్పుడు వెంకీ సినిమాలో రానా గెస్ట్ అప్పీయరెన్స్‌ ఇవ్వనున్నాడు. దీంతో వెంకీతో కలిసి నటించాలన్న రానా ఆశ తీరబోతోంది. కానీ వెంకీమామ చిత్రంలో రానా నటిస్తున్నట్లు చిత్ర బృందం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. 


ఇప్పటివరకు ఇద్దరి ప్రొఫెషన్స్‌ రివీల్ చేసారు, ఇద్దరి నేపధ్యం చూపించారు. కానీ అంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ కథ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎలా క్రియేట్ చేశారు, అది ఎంత బలంగా ఉంది అన్నదానిమీదే వెంకీమామ విజయం అనేది ఆధారపడి ఉంటుంది. నిజంగా ఆ పాయింట్‌లో బలం ఉంటే మాత్రం వెంకటేష్ అండ్ చైతూ ఈ సినిమాకి ప్రధానబలంగా మారతారు. ఇక ఈ ఫస్ట్ గ్లిoప్స్ మాత్రం ఇద్దరు హీరోయిన్స్‌కి కూడా అస్సలు చోటు ఇవ్వలేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: