టాలీవుడ్ లో కమెడియన్ గా తన ప్రస్థానం ప్రారంభించాడు బండ్ల గణేష్. సినిమాలో తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే వాడు. ఇలా చాలా సినిమాల్లో చేసిన అనంతరం... నిర్మాతగా అవతారం ఎత్తాడు బండ్ల గణేష్. నిర్మాతగా అవతారం ఎత్తిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమా తీసి... ఒక్కసారిగా స్టార్ నిర్మాత గా మారి పోయారు బండ్ల గణేష్. ఆ తర్వాత పలు భారీ బడ్జెట్ సినిమాలను కూడా నిర్మించి మంచి విజయాలను అందుకున్నారు . అయితే నిర్మాత బండ్ల గణేష్ పై  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే . నిర్మాత బండ్ల గణేష్ పై వైకాపా నేత పొట్లూరి వరప్రసాద్ జూబ్లీ హిల్స్  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

 

 

 

తన వద్ద టెంపర్ సినిమా కోసం బండ్ల గణేష్ ఫైనాన్స్  తీసుకున్నారని... ఆ డబ్బు తిరిగి చెల్లించలేదని... చెల్లించమని  అడిగితే సరిగా స్పందించడం లేదని... గట్టిగా అడిగితే బండ్ల గణేష్  బెదిరింపులకు పాల్పడుతున్నారని...అంతే కాకుండా  నిర్మాత బండ్ల గణేష్ తన అనుచరులు  తన ఇంటిపై దాడి చేశారంటూ నిర్మాత పొట్లూరి వరప్రసాద్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయగా.... నిర్మాత బండ్ల గణేష్... పీవీపీ  తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని తనకు ప్రాణహాని ఉందని తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

 

 

 

 అయితే గతంలో నిర్మాత పోట్లూరి వర  ప్రసాద్ బండ్ల గణేష్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే నిర్మాత పోట్లూరి  వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సినీ నిర్మాత బండ్ల గణేష్ ను  జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విచారిస్తున్నారు. అయితే బండ్ల గణేష్ పై గతంలో చెక్ బౌన్స్ కేసులు  కూడా ఉన్న విషయం తెలిసిందే. చెక్ బౌన్స్ కేసులు అప్పట్లో సంచలనంగా మారాయి . అయితే గత ఎలక్షన్లలో బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించి సంచాలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: