నేడు చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ కంటే కూడా హాలీవుడ్ చిత్రాల రేంజ్ వేరు.. అప్పటి టైటానిక్ మొదలు ఇప్పుడు టెర్మినేటర్ వరకు తెలుగులో అనువాదమయిన ఎన్నో హాలీవుడ్ చిత్రాలు తెలుగువారి ఆదరణ పొందాయి.. అయితే టెర్మినేటర్ చిత్రాలు మాత్రం ప్రపంచ స్థాయిలో తనదైన హవా చాటుకున్న విషయం తెలియంది కాదు.. ఆర్నాల్డ్‌ ప్రధాన పాత్ర పోషించిన టెర్మినేటర్ ఇప్పటికే ఐదు భాగాలు పుర్తిచేసుకొని ఇప్పుడు ఆరో భాగం విడుదలకు సిద్ధంగా ఉంది. 

1991వ సంవత్సరంలో వచ్చిన ‘టెర్మినేటర్‌- 2 జడ్జిమేంట్‌ డే’కు సీక్వెల్‌గా ఈ ఆరవ భాగం రూపొందించారని సమాచారం.. జేమ్స్‌ కామెరాన్ ఈ చిత్ర దర్శకత్వ బాధ్యత వహిస్తున్నారు. ఐతే ఈ సినిమా తమిళంలోనూ విడుదల కాబోతోందట.. ఈ తమిళ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం చెన్నైలో ఏర్పాటు చేయగా., నటుడు ఆర్య ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారని సమాచారం.. ఈ సందర్భంగా ఆర్య మాట్లాడుతూ ‘కొంత కాలంగా జిమ్‌కు వెళ్తున్నాడని,, అందువలన ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం తనకి దక్కిందని చెప్పుకొచ్చారు.

'జిమ్‌కు వెళ్లే ప్రతి ఒక్కరికీ ఆర్నాల్డ్‌ తెలియకుండా ఉండరని.., నేను ఆర్నాల్డ్ కు పెద్ద అభిమానిని.., హాలీవుడ్ స్టార్ హీరో నటించిన సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ ట్రైలర్‌ను చూస్తున్న ప్రతిసారీ ఒక కొత్త విషయం అర్థమవుతోంది. ఆర్నాల్డ్‌ నటించిన ట్రు లైస్‌, బార్బేరియన్‌, టెర్మినేటర్‌ లాంటి ఎన్నో చిత్రాలను చూశాను.., మరో 100 ఏళ్లు తర్వాత కూడా ఆయన పేరు చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోతుంది.., ఈ రోజు  ఆర్నాల్డ్ వంటి ప్రముఖ హీరో నటించిన ఒక ప్రతిష్టాత్మక సినిమా ట్రైలర్ ను విడుదల చేసేంత అరుదైన గౌరవం నాకు దక్కడం అనేది నేను చాలా అదృష్టం గా భావిస్తున్నాను" అని తమిళ ప్రముఖ నటుడు ఆర్య మాట్లాడి టెర్మినేటర్ తమిళ ట్రైలర్ ను విడుదల చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: