బుల్లితెరపై స్టార్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ గౌతమ్ మరోసారి తన పోస్టుతో వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని చేసిన పోస్టు ప్రశంసలు పొందుతోంది. మట్టిదివ్వెలు చేస్తున్న ఒక ముసలాయన ఫోటోతో పాటు టపాసులు అమ్ముతున్న ఓ తల్లి కొడుకుల ఫోటోను షేర్ చేసిన రష్మీ.. ఈ దీపావళికి షాపింగ్ మాల్స్ వదిలి ఇలాంటి స్థానిక వ్యాపారుల దగ్గర కొనుగోళ్లు చేయండి అంటూ కామెంట్ పెట్టింది. 


 దీపావళికి షాపింగ్ మాల్స్ లో కొనుగోళ్లు చేసే బదులు ఇలాంటి పేద వ్యాపారుల దగ్గర కొనుగోళ్లు జరిపితే వారు కూడా ఆనందంగా పండుగ జరుపుకుంటారని భావిస్తున్నట్లుగా ఈ పోస్టును షేర్ చేసింది రష్మీ. రష్మీ చేసిన ఈ పోస్టుకు ఆమె అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. చాలా మంది ఆమె ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. 
       
కాగా బుల్లితెరపై జబర్దస్త్ షోతో పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ.. వెండితెరపై పలు చిత్రాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  సోషల్ మీడియాలో తన అభిమానుల ప్రశ్నలకు సమాధానాలు బోల్డుగా సమాధానాలు ఇస్తూ ఉండే రష్మీ.. ఇలాంటి సందేశాత్మక పోస్టులతో కాలుష్య రహిత దీపావళికి తన వంతు ప్రచారాన్ని కల్పిస్తోంది.


  దీపావళి మార్కెట్ ను నమ్ముకొని దివ్వెల ద్వారా ఆదాయాన్ని సంపాదించాలనుకునే వారికి మద్దతుగా ఇప్పటికే ఇప్పటికే # PKD పేరుతో పలువురు సెలబ్రెటీలు పోస్టులు పెడుతుండగా.. చిన్న వ్యాపారులను ఈ దీపావళిని ఆనందంగా జరుపుకునేలా చేసేలా ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా పలువురు పిలుపునిస్తున్నార. దీనికి మద్దతుగా రష్మీ కూడా స్పందించడంపై పలువురు నెటిజన్లు పోస్టులు ద్వారా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి మనం కూడా ఈ దీపావళికి మట్టి దివ్వెలతో జరుపుకుని నలుగురికి ఆనందాన్నిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: