బిత్తిరి సత్తి ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే బిత్తిరి సత్తి పాటలు ప్రత్యేకమైన హావభావాలతో తెలంగాణ యాసలో మొత్తం తెలంగాణ ప్రజానీకాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి బిత్తిరి సత్తి. ఆయన  మాట్లాడే భాష యాస... ముఖంలోని హావభావాలు ఇది ఒక బిత్తిరి సత్తి కే సాధ్యం అని చెప్పవచ్చు. అయితే అసలు ఈ బిత్తిరి  సత్తి ఎవరు... అతనికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే. ఈ స్టోరీ చదవాల్సిందే. బిత్తిరి సత్తి అసలు పేరు కావలి రవి కుమార్.  అతని ఊరు చేవెల్ల కావడంతో అతని అందరూ చేవెళ్ల రవి కుమార్  అని పిలుస్తుంటారు. బిత్తిరి సత్తి చేసే సందడి  తెలంగాణ ప్రేక్షకుడి మదిలో చేరిపోయింది . పాట పాడిన డైలాగ్ చెప్పిన ఆయన ప్రత్యేకమైన హావభావాలు  ప్రతిదీ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తుంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పామేన లో పుట్టాడు చేవెళ్ల  రవికుమార్  అలియాస్ బిత్తిరి సత్తి. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం ఉండడంతో.... 2003లో హైదరాబాద్ వచ్చి ఆఫర్ల కోసం ఎదురు చూశాడు. 

 

 

 

 తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర అసిస్టెంట్ మేనేజర్ గా పని చేశాడు బిత్తిరి సత్తి. అయితే ఆ తర్వాత ఓ వ్యక్తి సలహాతో 2005లో డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో సభ్యత్వం తీసుకొని పదిహేనేళ్ల పాటు 150 సినిమాలకు డబ్బింగ్ చెప్పాడు చేవెళ్ల రవి . చిన్న పాత్రలో సినిమాల్లోకి అడుగు పెట్టిన బిత్తిరి సత్తి... 2015వరకు చిన్నాచితకా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. 2015 సంవత్సరంలో v6 ఛానల్ లో చేరాడు చేవెళ్ల రవికుమార్ . v6 ఛానల్ లో ప్రసారమైన తీన్మార్ న్యూస్ ద్వారా బిత్తిరి సత్తి గా అవతారమెత్తి.... ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తీన్మార్ సావిత్రి తో కలిసి ఆయన చేసిన సందడి... v6 తీన్మార్ ప్రోగ్రాం రేటు కూడా ఎక్కడికో తీసుకెల్లింది .

 

 

 

చేవెళ్ల రవి బిత్తిరి సత్తిలా మారడానికి... ఆయన అలా  నటించడానికి... హావభావాలు  పలికించడానికి ఓ వ్యక్తి స్ఫూర్తి అని ఆయన వల్లే తాను ప్రత్యేకతను సాధించానని  చెప్పాడు చేవెళ్ల రవి. తమ ఇంటి పక్కనే ముకుందరెడ్డి అనే ఓ వ్యక్తి ఉండేవాడని .... ఆయన పలికించిన హావభావాలు ఆకట్టుకుంటాయని ఆయన హావభావాలు తాను ప్రయత్నించి విజయం సాధించాడని చెప్పారు చేవెళ్ల రవి . అయితే ఆయన ఎప్పుడూ ఈ లోకంలో లేరని...  కానీ తన మనసులో మాత్రం చిరస్థాయిగా ఉంటారని చెప్పారు. కాగా చేవెళ్ల  రవికుమార్ తాజాగా తుపాకి రాముడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను  బతుకమ్మ ఆల్ రౌండర్ లాంటి సినిమాలు తెరకెక్కించిన  దర్శకుడు ప్రభాకర్ తెరకెక్కిస్తున్నారు. కాగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా  విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: