పంజాబీ భామ.. అందాల ముద్దు గుమ్మ.. రకుల్ ప్రీత్ సింగ్ అంటే తెలియని తెలుగు వారు లేరు.. ఫిట్నెస్ విషయంలో ఆమె తీరు ప్రత్యేకం.. పంజాబ్ లో పుట్టి.. ఢిల్లీలో పెరిగిన ఈ అమ్మడు మాత్రం తెలుగు వారికి బాగా సుపరిచితురాలు.. ప్రపంచమంతా మనదే అనుకుంటే.. ఇక సమస్యలు ఎక్కడ ఉంటాయి అంటున్న రకుల్‌ప్రీత్‌ సింగ్‌.. మొదట దక్షిణాదిలో తన కెరీర్‌ని తీర్చిదిద్దుకొంది. ఇప్పుడు హిందీలో కూడా ఈ అమ్మాయి బాగానే రాణిస్తోంది. 

 

 

మాతృభాష పంజాబీ అంత స్పష్టంగా తెలుగును మాట్లాడటం రకుల్‌ ప్రత్యేకం. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ ‘‘చాలామంది నా ప్రయాణం గురించి మాట్లాడుతూ.. నేను ఏ ప్రాతం పిల్లని అని అడుగుతున్నారు. నేను ఆర్మీ కుటుంబానికి చెందిన అమ్మాయిని.. మా నాన్నగారు ఆర్మీ ఉద్యోగస్తులు కావడంతో నేను దేశంలోని పలు ప్రాంతాలు తిరిగాను. అందుకే నేనెవరిని..?? ఏ ప్రాంతానికి చెందిన  అమ్మాయిని..?? అనే ఆలోచన నాకింత వరకు కలుగలేదు.. నా చిన్నతనం నుంచి మా కుటుంబంతో ఎక్కడికి వెళ్లినా కూడా అక్కడి వాతావరణ పరిస్థితులకు  తొందరగా అలవాటు పడిపోవడం..,, అందరితోనూ త్వరగా కలిసిపోవడం వలన సాంస్కృతికంగా నాకెలాంటి సమస్య రాలేదన్నారు.

 

 

అంతేకాకుండా చిన్నప్పట్నుంచే ఉన్న ఈ అలవాటు ఇప్పుడు కెరీర్‌ విషయం లో నాకు బాగా ప్లస్ అయ్యింది.. నేను ఏ భాషలోకి వెళ్లినా సరే... అమ్మో ఈ భాష మనకు కొత్త..!! ఈ మనుషులు మనకు కొత్త..!! అనే ఆలోచనలు నాకు అస్సలు కలగవు.. నేనున్న రెండు మూడు రోజుల్లోనే అందరితో కలిసిపోవడం నాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటైపోయింది" అని రకుల్ అన్నారు.. బహుశా ఇందుకేనేమో తెలుగు ప్రజలు ఈమెకు ఎంతగా ఫిదా అయ్యారో వేరే తెలియంది కాదు.. ప్రస్తుతం మన రకుల్ ప్రీత్ సింగ్ కేవలం తెలుగు కే పరిమితం కాకుండా తెలుగుతో బాటు తమిళం, హిందీ చిత్రాలతో చాలా బిజీగా మారారు..

మరింత సమాచారం తెలుసుకోండి: