బుల్లితెర మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ ప్రదీప్ మాచినేని అంటే తెలియని తెలుగు వారు లేరు.. తన అందం., తన గాత్రం, తన సమయస్ఫూర్తితో టీవీ వ్యాఖ్యాతగా రాణిస్తూ పిన్న పెద్ద తేడా లేకుండా ఎంతోమంది ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్న వ్యక్తి ప్రదీప్.. ఈ రోజు జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న ప్రదీప్ మాచినేని ఆయన జీవితంలో జరిగిన పలు విశేషాలను మీడియా తో పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు చూసేద్దామ మరి.

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో పుట్టిన ప్రదీప్.. హైదరాబాద్‌లోని విజ్ఞాన్ కాలేజి లో బీటెక్(ఈఈఈ) పూర్తి చేసుకుని ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలో చేరాడు.ఇందులో పనిచేస్తున్నప్పుడు రేడియో మిర్చిలో రేడియో జాకీగా ఉద్యోగం రావడంతో రెండో ఆలోచన లేకుండా చేరిపోయాడు. అతని కెరీర్‌ ఊపందుకోవడానికి తన గాత్రం ఎంతో ఉపయోగపడింది. అలా అలా నెమ్మదిగా తన అద్భుతమైన గాత్రంతో వ్యాఖ్యాతగా టీవీ రంగంలో అడుగు పెట్టాడు..

కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్.., గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమానికి నంది అవార్డును అందుకున్నారు. బోలెడంత పేరును సంపాదించి పెట్టిన 'ఢీ' షో లో సుడిగాలి సుధీర్‌తో చేసే కామెడీ, పంచ్‌లు బాగా పండి అమ్మాయిల్లో ప్రదీప్ కు విపరీతంగా క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న ప్రదీప్ సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలతో మెప్పించాడు. 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా వంటి సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించారు. ఇక 2018 న్యూ ఇయర్ కి ముందు రోజు రాత్రి వేడుకల్లో పాల్గొన్న ప్రదీప్ మోతాదుకు మించి మద్యం సేవించి కారు నడపడంతో అతని కారును హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకొని కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అప్పుడు కాస్త అతని ఫేమ్ దెబ్బ తిన్న కూడా అధైర్య పడకుండా ఇంకా గొప్పగా రాణించాడు..

బర్త్ డే జరుపుకుంటున్న ప్రదీప్ మరింత సక్సెస్ సాధించి ఇంకా ఎక్కువ అలరించాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: