సినిమాలైనా థియేటర్ కు వెళ్లి చూడాలి కాని వంటిట్లో ఆడవాళ్లను టివిల ముందు కూర్చునేలా చేసేది మాత్రం సీరియల్సే.. ఫలానా సీరియల్ బాగుందని ఎవరో చెప్పినా.. లేక ఫలానా సీరియల్ బాగుందని వారికి అనిపించినా రెగ్యులర్ గా ఫాలో అవడమే కాదు ఆ టైంలో బందువులు వచ్చినా సరే పట్టించుకోరు సరికదా టివి రిమోట్ అడిగితే యుద్ధం ప్రకటిస్తారు.       


లేటెస్ట్ గా బుల్లితెరను ఏలేస్తున్న ఓ సీరియల్ పై సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అదేంటి అంటే స్టార్ మాలో వస్తున్న కార్తీక దీపం. పరిటాల నిరూపం, ప్రేమి విశ్వనాథ్ కలిసి నటిస్తున్న ఈ సీరియల్ సూపర్ హిట్ అయ్యింది. ముఖ్యంగా వంటలక్కగా ప్రేమి విశ్వనాథం చాలా ఫేమస్ అయ్యింది.


కాపుగంట రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సీరియల్ ను గుత్తా వెంకటేశ్వర రావు నిర్మించారు. స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న ఈ సీరియల్ గురించి కేవలం సోషల్ మీడియాలోనే కాదు ఏ నలుగురు ఆడవాళ్లు కలిసినా మాట్లాడుకోవడం విశేషం. డాక్టర్ బాబుగా నిరూపం పరిటాల, దీప పాత్రలో ప్రేమి విశ్వనాథం నటిస్తున్నారు.    


భార్యా భర్తలైన దీప, డాక్టర్ బాబులు ఎప్పుడు కలుస్తారో అని తెలుగు రెండు రాష్ట్రాల బుల్లితెర ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామూర్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.. స్టార్ మా లో వస్తున్న బిగ్ బాస్ షో కన్నా వంటలక్క కార్తీక దీపం సీరియల్ బాగా పాపులర్ అయ్యింది. ఇక ఈ సీరియల్ త్వరలో ముగుస్తుందని తెలుస్తుంది. సినిమా కూడా ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అదిరిపోయినట్టుగా సీరియల్ ముగింపు దశకు వచ్చాక ఇంకా బాగుందని అంటున్నారు. మొత్తానికి కార్తీక దీపం స్మాల్ స్క్రీన్ పై సూపర్ హిట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.    



మరింత సమాచారం తెలుసుకోండి: