బిగ్‌బాస్‌ షో లో అభిమానులను అలరించడానికి సర్కస్‌ ఫీట్లు చేయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు హౌస్‌మేట్స్‌. బిగ్ బాస్ సీజన్ 3 లో పద్నాలుగవ  వారానికి గానూ బిగ్‌బాస్‌ ఇచ్చిన నామినేషన్‌ టాస్క్‌.. ఈ సీజన్‌లోనే సూపర్ టాస్క్‌గా నిలిచిందని బిగ్ బాస్ షో అభిమానులు అంటున్నారు. ఫైనల్ కి వెళ్లే కొద్దీ ఉత్కంఠత మరింత పెంచే పనిలో పడ్డాడు బిగ్ బాస్.


ముగింపు దశలో ఉన్న బిగ్ బాస్ షో లో మరో ఆసక్తికర టాస్క్‌ ఇవ్వడానికి బిగ్‌బాస్‌ సిద్ధమయ్యాడ ని టాక్.  బలాబలాలను బేరీజు వేయటానికి నామినేట్‌ అయిన ఇంటి సభ్యులకు కఠినతరమైన టాస్క్‌లు ఇచ్చే పనిలో ఉన్నాడట. నామినేషన్‌లో ఉన్న బాబా భాస్కర్‌, వరుణ్‌, శ్రీముఖి, అలీ, శివజ్యోతిలకు వారి టాలెంట్ నిరూపించుకోవడానికి గోల్డెన్ చాన్స్ లాంటి టాస్క్‌లను ఒక్కొక్కరికి ఒక్కొకటి ఇచ్చాడు. 

తాజా ప్రోమో ప్రకారం.. టాస్క్‌లను విజయవంతంగా పూర్తి చేయడానికి ఇంటి సభ్యులు పడే తంటాలు, సర్కస్ ఫీట్లు చూస్తుంటే  ఎలాగైనా టాస్క్ విన్  అవ్వాలని గట్టి ప్రయత్నమే చేస్తున్నట్టున్నారు.  ఇలాంటి సమయంలోనూ కామెడీ కింగ్‌ బాబా భాస్కర్.. పంచ్‌లు విసురుతూ ఇంట్లో నవ్వుల పువ్వులు పూయిస్తున్నాడు. మరి వీళ్ల ఫీట్లతో జనాల్ని మెప్పిస్తారా? లేక బొక్కబోర్లా పడతారా అన్నది చూడాలి. 

 కానీ విషయం ఏంటంటే ఈ వారం ఎవర్ని పంపించాలన్నది ప్రేక్షకులు ఎప్పుడో డిసైడ్‌ అయ్యారని తెలుస్తోంది. నిజానికి గత వారం శివ జ్యోతి వెళ్ళిపోతుంది అనుకున్నారు. కానీ వారం స్వల్ప ఓటింగ్‌ తేడాతో గట్టెక్కింది. కానీ ఈసారి మాత్రం  శివజ్యోతి  తప్పించుకోలేదని అంటున్నారు ప్రేక్షకులు. బిగ్‌బాస్‌ షోకు బైబై చెప్పే రోజులు ఆమెకు దగ్గర్లోనే ఉన్నాయని నెటిజన్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో.



మరింత సమాచారం తెలుసుకోండి: