బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌ పెళ్ళి గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. సల్మాన్ సినిమాల కంటే పెళ్ళి గురించే ఎక్కువ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే సల్మాన్‌ ఈ జన్మలో పెళ్ళి చేసుకోరని అందరికి అర్థమైపోయింది. కానీ సల్మాన్ జీవితంలో జరిగిన సంఘటన మాత్రం ఇప్పటి వరకు ఎవరికి తెలీదు. వాస్తవంగా సల్మాన్ పెళ్ళి పీటలదాకా వచ్చి ఆగిపోయిందట. ఈ విషయాన్ని సల్మాన్ స్నేహితుడు, నిర్మాత సాజిద్ నదియాద్‌వాలా రీసెంట్‌గా రివీల్ చేశారు. సల్మాన్ నటించిన బాలీవుడ్ లేటెస్ట్ సినిమా 'దబాంగ్ 3' ప్రమోషన్స్‌లో భాగంగా సల్మాన్, సాజిద్ 'ది కపిల్ శర్మ షో' లో పాల్గొన్నారు. 

ఆ షోలో సాజిద్ ఈ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. 1999లో సల్మాన్‌కు పెళ్ళి ఫిక్సయిందట. సల్మాన్‌ ప్రేమించిన అమ్మాయినే పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాడట. అందుకే పెళ్ళి తేదీ ఫిక్స్ చేసుకొని శుభలేఖలు కూడా పంచేశారట. దాంతో సాజిద్ కూడా సల్మాన్‌తో పాటు పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. 1999 నవంబర్ 18న సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ బర్త్‌డే కావడంతో అదే రోజున సల్మాన్, సాజిద్ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. కానీ పెళ్ళికి వారం రోజులు ముందే 'నాకు పెళ్ళి చేసుకోవాలన్న మూడ్ లేదు' అంటు అందరికి గట్టి షాక్ ఇచ్చాడ సల్మాన్. అయితే సల్మాన్ పెళ్ళి చేసుకోవాలనుకుంది ప్రముఖ బాలీవుడ్ నటి సంగీతా బిజిలానీ నే అన్న విషయం అందరికి తెలిసిందే.

సల్మాన్, సంగీత చాలాకాలం డీప్ లవ్ లో ఉన్నారు. మంచి రిలేషన్ ని మేయింటేయిన్ చేశారు కూడా. అందుకే సల్మాన్ ఆమెతో పీకల్లోతు ప్రేమలో ఉండి పెళ్ళి చేసుకోవాలని డిసైడయ్యాడు. కానీ ఓసారి సంగీత మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటం గమనించిన సల్మాన్ గుండె బద్దలవడంతో సంగీతకు బ్రేకప్ చెప్పేశాడు.  ఇక జీవితంలో ప్రేమ, పెళ్ళి వద్దనుకున్నాడు. అయితే సంగీత తర్వాత సల్మాన్.. ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్‌లతో డేటింగ్ చేశాడు. వీరిద్దరితో కూడా సెట్ అవ్వలేదు. ఆ తర్వాత రొమేనియాకు చెందిన మోడల్ ఉలియా వంటూర్‌ను ఇండియాకు తీసుకొచ్చి అందరికీ షాకిచ్చాడు. అంతేకాదు ఆ అమ్మాయిని నేరుగా తన ఇంటికి తీసుకెళ్లి అందరికీ పరిచయం చేశాడు. దాంతో సల్మాన్, ఉలియా పెళ్ళి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. అందుకే ఇక సల్మాన్ పెళ్ళి చేసుకోడని అందరు ఫిక్సై పోయారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: