టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేడు తన 40వ పుట్టిన రోజుని జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పుట్టిన రోజు పండుగకు విదేశాల్లో ఉన్న రెబల్ స్టార్, అక్కడే తన కుటుంబసభ్యుల సమక్షంలో పుట్టినరోజును సాదాసీదాగా జరుపుకున్నట్లు సమాచారం. అయితే ఆ వేడుకను పురస్కరించుకుని మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ ఫ్యాన్స్, పలు సామజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈశ్వర్ తో మొదలయిన ప్రభాస్ సినీ ప్రయాణం, మొన్నటి సాహో వంటి భారీ మూవీతో సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతోంది. 

ఇకపోతే నేడు ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని పలువురు టాలీవుడ్ మరియు ఇతర భాషల ప్రముఖులు సైతం ఆయనకు పుట్టిన రోజు విషెస్ తెలియచేయడం విశేషం అనే చెప్పాలి. ఇక మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే దాదాపుగా చాలామంది నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు, మన బాహుబలికి తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. ఇక నేటి ఉదయం నుండి ప్రభాస్ పుట్టినరోజు హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్ లో విపరీతంగా హల్ చల్ చేయడంతో, ఆయనకు ఉన్న క్రేజ్ ని చూసి, పలువురు బడా బాలీవుడ్ నటులు సైతం ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట. 

బాహుబలి రెండు భాగాల అద్భుత విజయాలతో అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్న ప్రభాస్, ఇటీవలి సాహో తో మరింత గొప్పగా ఆ పేరును కొనసాగించడం జరిగింది. ఇక ప్రస్తుతం ప్రభాస్, జాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపి కృష్ణ మూవీస్, యువి క్రియేషన్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఒక పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: