‘బాహుబలి’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. దీంతో బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న రాజమౌళి...ఈ సినిమా మొదలు పెట్టడంతో ఈ సినిమాపై కూడా దేశవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇదిలా ఉండగా  టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే మొట్టమొదటిసారి నందమూరి మరియు మెగా కుటుంబాలకు చెందిన హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలిసి నటిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అని దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికుల తో పాటు తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఇద్దరు హీరోల అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


ఇటువంటి నేపద్యంలో సినిమా ప్రారంభమైన సందర్భంలోనే rrr సినిమా వచ్చే ఏడాది జులై 30వ తారీఖున విడుదల అవుతుందని పోస్టర్లలో క్లారిటీ ఇచ్చాడు రాజమౌళి. ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చాలా ఆలస్యంగా జరుగుతున్న తరుణంలో అసలు అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ అవుతుందా..? అంటూ ఇద్దరు హీరోలకు చెందిన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో పక్క ప్లానింగ్ వేసి సినిమా స్టార్ట్ చేసిన రాజమౌళి కి అసలు సినిమా ఆలస్యం అవటానికి గల కారణం సినిమాలో నటిస్తున్నబాలీవుడ్ నటులే అంట.


అలియా భట్ ఫుల్ బిజీగా ఉండడంతో ఆమె డేట్స్ అసలు దొరకడం లేదంట. దాంతో ఆమె పాత్రని కుదించడానికి రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక మరో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తన హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాడట. హిందీ సినిమాని పక్కన పెట్టి దీనికి డేట్స్ ఇవ్వడం లేదు. దాంతో అతనికోసం జనవరి వరకు rrr సినిమా యూనిట్ వేచి ఉండాల్సి వస్తున్నట్లు సమాచారం. ఇందువల్లనే ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ ఆలస్యం గా జరుగుతున్నట్లు ఫిలిం ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. 


మరింత సమాచారం తెలుసుకోండి: