శ్రీదేవి పేరు చెప్పగానే పదహారేళ్ళ వయసు గుర్తుకువస్తుంది. అసలు పదహారేళ్ల పడుచుపిల్ల అని చెప్పగానే కూడా శ్రీదేవి కనిపిస్తుంది. అంతటి అందం, అనుబంధం పదహారుతో శ్రీదేవిది. ఆమె ఎవర్ గ్రీన్ హీరోయిన్. ఆమె వెండితెర జాబిల్లిగా, అతిలోక సుందరిగా వెలిగారు. శ్రీదేవి తెలుగులో చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్లు ఉన్నాయి. అదే విధంగా ఆమె బాలీవుడ్ కి వెళ్ళి నంబర్ వన్ గా  జెండా ఎగరేసిన  ఏకైన సౌత్ ఇండియా హీరోయిన్.


ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటా మిన్న శ్రీదేవి అని చెప్పాలి. అందం, అభినయం కలబోసిన శ్రీదేవి యాభై పడి మధ్యలోనే కన్నుమూశారు. ఎంతో భవిష్యత్తు, జీవితం ఉన్న ఆమె అర్ధాంతరంగా కన్నుమూయడం శ్రీదేవి అభిమానులను ఇప్పటికీ క్రుంగదీస్తోంది. ఇది బయోపిక్ ల యుగం. శ్రీదేవి జీవితం ఆధారంగా సినిమా తీయాలని చాలా మంది ఆలోచన చేస్తున్న సందర్భం కూడా ఉంది.
ఒకవేళ శ్రీదేవి బయోపిక్ ఎవరైనా తీస్తే తాను నటిస్తానని తళుకు బెళుకుల  తార  తమన్నా అంటోంది.


ఈ మిల్కీ బ్యూటీకి శ్రీదేవి అంటే అంత ఇష్టమట. శ్రీదేవిని తాను ఎప్పటికీ యువ తారగానే చూస్తానని కూడా చెబుతున్న తమన్నా అది తన డ్రీమ్ క్యారక్టర్ అంటోంది. మరి ఈ సినిమా ఎవరు తీస్తారో కానీ తమన్నా రెడీగా ఉంది. మెప్పించేందుకు కూడా హుషార్ చూపిస్తోంది. ఇంతకీ ఆ పనేదో భర్త‌ బోనీ కపూర్ చేస్తే సరిపోతుందేమో. ఆయన బడా నిర్మాత కూడా. పైగా అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ మొత్తం బంధం పెనవేసుకున్నవాడు, తమన్నా ఇచ్చిన ఈ ఓపెన్ ఆఫర్ ని చూసైనా బోనీ ముందుకు వస్తే అందాల శ్రీదేవి తమన్నా రూపంలో మరోసారి వెండితెర మీద‌ మెరవడం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: