బిగ్ బాస్ సీజన్ 3 మరో రెండు వారాలు మాత్రమే ఉంది. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఇంట్లో ఆరుగురు ఇంటి సభ్యులు ఉండగా వారిలో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత వారం టైటిల్ విన్నర్ ను ప్రకటిస్తారు. హౌజ్ లో ఉన్న వారిలో ఇప్పటికే రాహుల్ టికెట్ టూ ఫినాలే అందుకున్నాడు. ఉన్న వాళ్ల అందరిలో రాహుల్ ఒక్కడే ఫైనల్స్ కు చేరుకున్నాడు.


ఇక మిగిలిన ఐదుగురిలో ఒకరు ఎలిమినేట్ అయితే మిగతా నలుగురు కూడా ఫైనల్స్ లో ఉంటారు. అయితే ఫైనల్స్ వరకు ఐదుగురు ఉన్నా టైటిల్ విన్నర్ ఎనౌన్స్ చేసే టైం కు కేవలం ఇద్దరిని మాత్రమే ఇంట్లో ఉంచుతారు. ఆ ఇద్దరిని హోస్ట్ నాగార్జున హౌజ్ లోకి వెళ్లి వారిని తీసుకుని వస్తాడు. అయితే ఇంతకీ ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి అంటే రాహుల్, వరుణ్, శ్రీముఖి అని అంటున్నారు.


మొన్నటి వరకు వరుణ్ టాప్ ప్లేస్ లో ఉండగా ఈ వారం అంచనాలు తారుమారు అయ్యాయి. అందుకే రాహుల్ ఫైనల్స్ లో మొదటి వ్యక్తిగా వెళ్లాడు. ఇదిలాఉంటే టాప్ 3లో శ్రీముఖి కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. శ్రీముఖికి కూడా బుల్లితెర మీద భారీ క్రేజ్ ఉంది. అందుకే ఆమెను విజేతగా చేస్తారని కొందరి మాట.


ఓటింగ్ ఎలాగు రివీల్ అవదు కనుక శ్రీముఖిని విన్నర్ చేసే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వచ్చాయి. అయితే రాహుల్ వర్సెస్ వరుణ్ వర్సెస్ శ్రీముఖి ఈ ముగ్గురిలోనే బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ ఉంటాడని తెలుస్తుంది. అయితే ఇప్పటికి ఇంట్లో ఉన్న అలి, బాబా భాస్కర్, శివ జ్యోతిలు కూడా టైటిల్ రేసులో లేరా అంటే ఆట ముగిసే వరకు ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి కేవలం టైటిల్ విన్నర్ గా ఎవరు అన్నది అంచనాలు మాత్రమే చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: