మెగా కోడలు ఉపాసన కొన్నిరోజుల క్రితం ప్రధానమంత్రి మోడీని విమర్శిస్తూ చేసిన విమర్శలకు ఫలితంగా చిరంజీవి రామ్ చరణ్ లకు మోడీ నుండి పిలుపు వచ్చింది అంటూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈమధ్యనే ప్రధాని మోడీ మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అనేకమంది ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులను ఆహ్వానించి గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఫిలిం సెలెబ్రెటీల సహాయ సహకారాలు కోరారు. 

అయితే ఈసమావేశానికి దక్షిణభారత సినిమా రంగానికి చెందిన ఏప్రముఖ సెలెబ్రెటీకి ఆహ్వానం అందలేదు. ఈవిషయమై ఈమధ్య ఉపాసన ఘాటుగా స్పందిస్తూ మోడీ దక్షిణాది ఫిలిం సెలెబ్రెటీలను మరిచిపోయారా అంటూ ప్రశ్నించింది. ఈవిషయం జరిగి కొన్నిరోజులు కూడ అవ్వకుండానే ప్రధాని మోడీ ఆఫీసు నుండి చిరంజీవి చరణ్ లకు పిలుపు వచ్చింది అన్నవార్తలు వినిపిస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈరోజు చిరంజీవి మోడీల మధ్య ప్రత్యేక సమావేశం జరగడమే కాకుండా ఇదేరోజు మోడీ ‘సైరా’ ను చూసే అవకాసం ఉంది అంటున్నారు. ఈవిషయమై ఇప్పటికే చిరంజీవికి ప్రధాని కార్యాలయం నుండి వర్తమానం వచ్చిందనీ ఈరోజు ఉదయం చిరంజీవి చరణ్ లతో కలిసి ఢిల్లీ వెళ్ళబోతున్నట్లు టాక్.

ప్రస్తుతం ఈవార్త ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలోనే కాకుండా రాజకీయ వర్గాలలో కూడ హాట్ న్యూస్ గా మారింది. గత కొంతకాలంగా బిజెపి పార్టీ తెలుగు రాష్ట్రాలలో నిలదొక్కుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఆపార్టీకి సరైన మాస్ లీడర్ తెలుగు రాష్ట్రాలలో లేకపోవడంతో ఆపార్టీ నిలబడలేక పోతోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రధాని మోడీ అదేవిధంగా చిరంజీవిల మధ్య జరగబోతున్న ఈసమావేశం కేవలం ‘సైరా’ కు మాత్రమే పరిమితం అవుతుందా లేదంటే చిరంజీవి రాజకీయ ఆలోచనలు మార్చే దిశలో ఈసమావేశం ప్రభావితం చేస్తుందా అన్న విషయం రానున్న రోజులలో తేలుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: